Whatsapp లో స్కామ్ కాల్స్ కి చెక్..ట్రూకాలర్ కొత్త ఆలోచన అదిరిందిగా.!
వాట్సాప్ స్కామ్ కాల్స్ కి చెక్
వాట్సాప్ లో కొత్త ఫీచర్ తెస్తున్న ట్రూకాలర్
వాట్సాప్ కాల్స్ కోసం TrueCaller కొత్త సర్వీస్ ను తీసుకురాబోతున్నట్లు చెబుతోంది
గత కొంత కాలంగా వాట్సాప్ యూజర్లు స్కామ్ కాల్స్ అందుకుంటున్నట్లు ఆన్లైన్ లో వారి గోడును వెళ్లబుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. వీటికి చెక్ పెట్టేందుకు ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ TrueCaller కొత్త ఫీచర్ తో వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి, స్కామర్లు, స్పామ్ మరియు టెలీ మార్కెటింగ్ కాల్స్ ను అరికట్టడానికి AI ఆధారిత ఫిల్టర్ లను జత చేయాలని TRAI ఇటీవలే నివేదించింది. అయితే, వాట్సాప్ కాల్స్ కి ఇది వర్తించదు కాబట్టి, దీన్ని గుర్తించిన స్కామర్లు వాట్సాప్ కాల్స్ ను కొత్త అస్త్రంగా మార్చుకున్నారు. అందుకే,వాట్సాప్ కాల్స్ కోసం TrueCaller కొత్త సర్వీస్ ను తీసుకురాబోతున్నట్లు చెబుతోంది.
ఇటీవల, అధికారిక రిజిస్ట్రేషన్స్ కలిగి ఉండని 10 డిజిట్ మొబైల్ నంబర్స్ ను తొలిగించింది. అయితే, స్కామర్లు మరియు టెలీ మార్కెట్ కాల్స్ కోసం వాట్సాప్ కాల్స్ ను ఉపయోగిస్తున్నట్లు యూజర్ల కథనాలను మనం చూశాము. అందుకే, ట్రూకాలర్ వాట్సాప్ లో వచ్చే కాల్స్ గుర్తించడానికి కొత్త సర్వీస్ ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది.
ఇటీవల వాట్సాప్ లో ఇంటర్నేషనల్ కోడ్స్ నుండి స్కామ్ కాల్స్ వస్తున్నట్లు చాలా మంది యూజర్లు వారి ట్విట్టర్ అకౌంట్స్ నుండి స్క్రీన్ షాట్స్ తో సహా ట్వీట్స్ చేశారు. ఈ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని, వారి ట్వీట్స్ నుండి చెబుతున్నారు. అటువంటి కాల్స్ ను అరికట్టడానికి ట్రూకాలర్ కొత్త సర్వీస్ ను తీసుకువస్తే బాగా ఉపయోగపడుతుంది.