ఇండియాలో ఫేస్ బుక్ ఫ్రీ basics ఇక లేదు. ఫైనల్ రూల్స్ ను విడుదల చేసిన TRAI
టెలికాం రేగులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఫైనల్ గా ఇంటర్నెట్ ను ఓపెన్ గా కాకుండా డిఫరెంట్ ప్రైసెస్ తో వాడటానికి నిరాకరించింది. నిన్న పబ్లిక్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది దీని పై.
రీసెంట్ గా ఇండియాలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ కనెక్టింగ్ ఇండియా పేరిట చేసిన ఫేస్ బుక్ బేసిక్స్ ఈ విషయాన్ని మరింత జటిలం చేసింది.
దేశంలోని పల్లెలకు కూడా ఇంటర్నెట్ అందాలి అనే మాట చెబుతూ ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ చేస్తూ వచ్చిన మార్క్ ఆఖరికి ఇండియన్ గవర్నమెంట్ మరియు పబ్లిక్ మన్నల పొందలేకపోయాడు.
ఫేస్ బుక్ బేసిక్స్ బయటకు సింగిల్ టాగ్ లైన్ తో కనెక్టింగ్ ఇండియా అని చెబుతున్నా, లోపల చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. వీటి పైన చర్చ అంతా. దీని వలన ఇంటర్నెట్ ను పబ్లిక్ స్వచ్ఛందంగా వాడుకోవటానికి అవ్వదు. ఎవరికి నచ్చినట్టుగా వారు వేరు వేరు వెబ్ సైట్ల తగ్గట్టుగా సెపరేట్ గా డబ్బులు తీసుకోవటం మొదలవుతుంది.
ఇంటర్నెట్ ను స్థలాలను అమ్ముకున్నట్లు అమ్ముకునే కొత్త ఒరవడిని తీసుకువస్తుంది ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ allow చేస్తే. అందుకే TRAI దీనిని నిరాకరించి net neutrality(ఓపెన్ ఇంటర్నెట్) కు సపోర్ట్ చేస్తూ కొత్త రూల్స్ ను సబ్మిట్ చేసింది.
దీనికి మార్క్ "ఇండియా ను కనెక్ట్ చేయటమే మా లక్ష్యం. దానిపై ఎప్పటికైనా పని చేస్తూనే ఉంటాము" అని తన సోషల్ అకౌంట్ ద్వారా తెలిపారు.
ఇక ముందు అయినా ఇలా కంటెంట్ వైజ్ గా ఇంటర్నెట్ ను ప్రైసింగ్ చేయటానికి ఎవరూ ప్రయత్నాలు అగ్రిమెంట్స్ లేదా కాంట్రాక్ట్స్ ద్వారా కూడా ట్రై చేయకూడదు అని తెలిపింది TRAI
అసలు ఫ్రీ బేసిక్స్ అంటే ఏమిటి? మంచిదా చెడ్డగా కంప్లీట్ స్టోరీ సింపుల్ గా ఈ లింక్ లో చదవగలరు
TRAI ఇచ్చిన కంప్లీట్ notes ఇక్కడ చదవగలరు.