మరో 5 రోజుల్లో ఈ 10 అంకెల మొబైల్ నంబర్లను బంద్ చేయనున్న TRAI..!

Updated on 07-Apr-2023
HIGHLIGHTS

TRAI మరో 5 రోజుల్లో కొన్ని10 డిజిట్ మొబైల్ నంబర్స్ ను బంద్ చేయనునట్లు తెలుస్తోంద

30 రోజుల గడువును కూడా ట్రాయ్ చివరి అవకాశం గా అందించింది

ట్రాయ్ ఈ నంబర్లను నిలిపివేయనునట్లు తెలుస్తోంది

టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మరో 5 రోజుల్లో కొన్ని10 డిజిట్ మొబైల్ నంబర్స్ ను బంద్ చేయనునట్లు తెలుస్తోంది. ఎందుకంటే, TRAI రూల్స్ ను పక్కకునెట్టి టెలీమార్కెటింగ్ కోసం 10 అంకెల మొబైల్ నంబర్ లను ఉపయోగిస్తున్న టెలీ మార్కెటింగ్ కంపెనీలకు సంభందించిన 10 అంకెల మొబైల్ నంబర్స్ ను నిలిపివేయనున్నట్లు ట్రాయ్ అల్టిమేట్టం వెల్లడించింది. దీనికోసం, 30 రోజుల గడువును కూడా ట్రాయ్ చివరి అవకాశం గా అందించింది. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండటంతో, ట్రాయ్ ఈ నంబర్లను నిలిపివేయనునట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి, టెలీ మార్కెటింగ్ కంపెనీలకు సాధారణ 10 మొబైల్ నంబర్ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే నంబర్స్ ను ఉపయోగిస్తాయి. ఎందుకంటే, టెలీ మార్కెటింగ్ కాల్స్ లేదా మెసేజీలు సాధరణ వినియోగదారుల నుండి భిన్నంగా మరియు అర్ధమయ్యేలా ఉండేదుకు ఇలా చేస్తారు. అయితే, చాలా టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఈ నియమాలను తుంగలో తొక్కి, వారి ఇష్టానుసారం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించి వారి ప్రమోషన్స్ ను కొనసాగిస్తున్నాయి. అయితే, ఇక నుండి ఇటువంటి ఆటలు సాగవని ట్రాయ్ కొత్త నిర్ణయం హెచ్చరిస్తుంది. 

ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?

సాధరణ 10 అంకెల నంబర్ లతో యూజర్లను విసిగిస్తున్న టెలీ మార్కెటింగ్ కంపెనీల పైన కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా, టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఆచరిస్తున్న ఈ అనైతిక పనులను TRAI పూర్తిగా కట్టడి చెయ్యాలని యోచిస్తోంది. ఇక ఎప్పటి నుండి ఇది అమలులోకి వస్తుంది? అని చూస్తే, రిజిష్టర్ చెయ్యకుండా ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించే నంబర్ లను వెంటనే ఆపివేయాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం, 30 రోజుల వ్యవధిని కంపెనీలకు ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది. ఈ  గడువు ముగుస్తుండటంతో ఈ నంబర్లను నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :