నెల రోజుల్లో బంద్ అవనున్న 10 డిజిట్ మొబైల్ నంబర్స్..ఇవి మాత్రమే.!
నెల రోజుల్లో బంద్ అవనున్న 10 డిజిట్ మొబైల్ నంబర్స్
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిర్ణయం
ఇక నుండి ఇటువంటి ఆటలు సాగవని ట్రాయ్ కొత్త నిర్ణయం హెచ్చరిస్తుంది
నెల రోజుల్లో బంద్ అవనున్న 10 డిజిట్ మొబైల్ నంబర్స్. ఈ అంటోంది టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI). అయితే, 10 అంకెల మొబైల్ నంబర్ లను ఉపయోగిస్తున్న వినియోగదారులు అందరి నంబర్లను కాదు ట్రాయ్ బంద్ చేస్తానంటోంది. TRAI నిబంధనలను అనుసరించని టెలీ మార్కెటింగ్ కంపెనీల 10 అంకెల మొబైల్ నంబర్స్ మాత్రమే నిలిపివేయనునట్లు ట్రాయ్ ప్రకటించింది. నిజానికి, టెలీ మార్కెటింగ్ కంపెనీలు TRAI నియమాల ప్రకారమే తమ ప్రమోషనల్ కాలింగ్ మరియు మెసేజీలను ఉపయోంచే వీలుంటుంది. కానీ, టెలీ మార్కెటింగ్ కంపెనీలు అడ్డదారిలో వారి ప్రమోషనల్ కాల్స్ చేస్తున్నాయి, అందుకే TRAI ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి, టెలీ మార్కెటింగ్ కంపెనీలకు సాధారణ 10 మొబైల్ నంబర్ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే నంబర్స్ ను ఉపయోగిస్తాయి. ఎందుకంటే, టెలీ మార్కెటింగ్ కాల్స్ లేదా మెసేజీలు సాధరణ వినియోగదారుల నుండి భిన్నంగా మరియు అర్ధమయ్యేలా ఉండేదుకు ఇలా చేస్తారు. అయితే, చాలా టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఈ నియమాలను తుంగలో తొక్కి, వారి ఇష్టానుసారం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించి వారి ప్రమోషన్స్ ను కొనసాగిస్తున్నాయి. అయితే, ఇక నుండి ఇటువంటి ఆటలు సాగవని ట్రాయ్ కొత్త నిర్ణయం హెచ్చరిస్తుంది.
ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?
సాధరణ 10 అంకెల నంబర్ లతో యూజర్లను విసిగిస్తున్న టెలీ మార్కెటింగ్ కంపెనీల పైన కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా, టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఆచరిస్తున్న ఈ అనైతిక పనులను TRAI పూర్తిగా కట్టడి చెయ్యాలని యోచిస్తోంది. ఇక ఎప్పటి నుండి ఇది అమలులోకి వస్తుంది? అని చూస్తే, రిజిష్టర్ చెయ్యకుండా ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించే నంబర్ లను వెంటనే ఆపివేయాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం, 30 రోజుల వ్యవధిని కంపెనీలకు ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది.