TRAI: టెలికాం అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికాం కంపెనీలకు కొత్త నిర్దేశాలను జారీ చేసింది. టెలికాం కంపెనీలు అందిస్తున్న రెగ్యులర్ సర్వీసులతో పాటు యూజర్ కు అవసరమైన మరొక సర్వీస్ ను కూడా తమ వెబ్సైట్ లలో అందించాలని సూచించింది. అదేమిటంటే, టెలికాం కంపెనీలు అందిస్తున్న అధికారిక వెబ్సైట్ లలో కవరేజ్ మ్యాప్ ను జత చేయాలని ఆదేశించింది.
ఎక్కడ నెట్ వర్క్ పని చేస్తుంది మరియు ఎక్కువ నెట్ వర్క్ ఎక్కువగా అందుబాటులో ఉందో తెలియజేసే Geospatial నెట్ వర్క్ కవరేజ్ మ్యాప్ ను తమ వెబ్సైట్ లలో అందించేలా చూడాలని ట్రాయ్ కొత్తగా ఆదేశించింది. అక్టోబర్ 1 2024 కొత్త రూల్స్ తో ట్రాయ్ పెంపొందించిన క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ (QoS) రెగ్యులేటర్స్ ఆఫ్ టెలికాం ఆపరేటర్స్ రూల్స్ లో భాగంగా ఇది చేయాల్సి ఉంటుందని సూచించింది.
జియోస్పెటియల్ నెట్ వర్క్ కవరేజ్ మ్యాప్ ను వెబ్సైట్ లలో అందించడం ద్వారా యూజర్లు వారి ఏరియాలో బాగా అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ను ఎంచుకునే అవకాశం ఉంటుందని కూడా ట్రాయ్ తెలిపింది.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న Vu DJ Smart Tv.!
ఈ కోత్త సర్వీస్ ద్వారా టెలికాం కంపెనీల సర్వీస్ లలో యూనిటి మరియు పారదర్శకత్వం మరింత మెరుగువుతుందని ట్రాయ్ చెబుతోంది. అందుకే, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ టెలికాం కంపెనీ వారి వెబ్సైట్ లలో 2G,3G,4G మరియు 5G నెట్ వర్క్ జియోస్పెటియల్ కవరేజ్ మ్యాప్ ని జత చేయాలనీ ఆదేశించింది. ఈ మ్యాప్ ను వైర్లెస్ మరియు వైర్లెస్ బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ లను ఎంచుకున్న యూజర్స్ అందిరికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని ట్రాయ్ తెలిపింది.