Toxic Panda Malware పేరుతో కొత్త మాల్వేర్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ కొత్త ట్రోజన్ మాల్వేర్ ఇప్పటికే కొన్ని దేశాలను చుట్టేసింది మరియు ఇప్పుడు ఇతర దేశాలు కూడా దీని బారిన పడే ప్రమాదం పొంచి ఉందట. ఈ కొత్త అప్డేట్ ను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ Cleafy బయటపెట్టింది. ఈ కొత్త ట్రోజన్ మాల్వేర్ ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది మరియు యూజర్ బ్యాంక్ అకౌంట్ లక్ష్యంగా దాడి చేస్తుందిట.
గతంలో విస్తృతంగా విస్తరించిన TgToxic మాల్వేర్ ఫ్యామిలి లో ఇది కూడా ఒక మెంబర్ గా చెబుతున్నారు. ఇది ఫైనాన్షియల్ ఫోకస్ మాల్వేర్ గా పని చేస్తుంది మరియు యూజర్ అకౌంట్ వివరాలు దోచుకుంటుందని Cleafy రీసెర్చర్లు చెబుతున్నారు. అంతేకాదు, ఈ మాల్వేర్ ఇప్పటికే యూరప్ మరియు లాటిన్ అమెరికా వ్యాప్తంగా 1500 కు పైగా డివైజ్ లలో ఈ మాల్వేర్ ఆనవాళ్లు కనిపించాయి.
ఈ మాల్వేర్ యూజర్ బ్యాంక్ అకౌంట్ ను టార్గెట్ చేస్తుంది. ఇది ఫోన్ ను పూర్తిగా లోబరుచుకొని OTP లకు కూడా నేరుగా యాక్సెస్ అందుతుంది. ఈ విధంగా ఈ మాల్వేర్ అటాకర్స్ కి ఫోన్ యొక్క రిమోట్ యాక్సెస్ అందిస్తుంది. ఈ విధంగా ఈ మాల్వేర్ డిజైవ్ లను పూర్తిగా తన అధీనం లోకి తీసుకుంటుంది. అందుకే, ఈ మాల్వేర్ చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ టాక్సిక్ పాండా మాల్వేర్ గూగుల్ క్రోమ్ మరియు బ్యాంకింగ్ యాప్స్ ముసుగులో యూజర్లకు వేల వేస్తుంది. అంటే, అచ్చంగా గూగుల్ క్రోమ్ మరియు ప్రముఖ బ్యాంకింగ్ యాప్స్ మాదిరిగా నకలును సిద్ధం చేస్తుంది. ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసిన వారి డివైజ్ ను పూర్తిగా లొంగదీసుకుంటుంది.
ఇటలీ, పోర్చుగల్, పెరూ, పోర్చుగల్ మరియు హాంకాంగ్ వంటి చాలా దేశాల్లో వందల కొద్దీ డివైజ్ లు ఈ మాల్వేర్ బారిన పడినట్లు కూడా ఈ నివేదిక తెలిపింది. ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది మరియు ఈ మాల్వేర్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది.
Also Read: Jio Tv+ లో వచ్చి చేరిన కొత్త AI Sensor.. ఇక నుంచి ఆ సీన్లు ఉండవు.!
ఈ మాల్వేర్ బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాల్వేర్ బారిన పడటానికి ప్రధాన కారణం సోర్స్ తెలియని అనామక యాప్స్ ను డౌన్లోడ్ చేయడమే. అందుకే, Google Play Store నుంచి యప్స ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ లో అనామక యప్స చేరుకునే అవకాశం ఉండదు. అలాగే, ఈ ఫోన్ ను మరియు యాప్స్ ను రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలి.
ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.