Gold Rate Update: ప్రస్తుత గోల్డ్ మార్కెట్ ఎటువైపుకు వెళుతోంది..!
Gold Rate Update: ప్రస్తుత గోల్డ్ మార్కెట్ ఎటువైపుకు వెళుతోంది
ప్రస్తుత గోల్డ్ మార్కెట్ ఒకేరోజు క్రిందకు దిగజారితే మరొక రోజు పెరుగుతోంది
గోల్డ్ మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట మరోలా వుంది
Gold Rate Update: ప్రస్తుత గోల్డ్ మార్కెట్ ఎటువైపుకు వెళుతోంది అనేది ప్రస్తుతం గోల్డ్ ప్రియులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఎందుకంటే, ప్రస్తుత గోల్డ్ మార్కెట్ ఒకేరోజు క్రిందకు దిగజారితే మరొక రోజు పెరుగుతోంది. కానీ, దాదాపుగా గత నాలుగు నెలలుగా 58 వేల నుండి 60వేల మార్క్ లోపలే కొనసాగుతోంది. అయితే, గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల అంచనాలు ప్రస్తుతం తల్లక్రిందులు అవుతున్నాయి. కానీ, గోల్డ్ మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట మరోలా వుంది. అందుకే, ఈరోజు Gold Rate Update తో పాటుగా గత రెండుదే నెలల గోల్డ్ మార్కెట్ వివరాలు తెలుసుకుందామా.
Gold Rate Update
ఈరోజు గోల్డ్ మార్కెట్ స్పల్పంగా పెరుగు నమోదు చేసింది. ఈరోజు ఒక తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 59,890 రూపాయల వద్ద ప్రారంభమై రూ.110 రూపాయలు పెరిగి రూ. 60,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అయితే, గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర 400 రూపాయలకు పైగా పెరుగుధలను నమోదు చేసింది. అలాగే, ఈరోజు ఒక తులం 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 54,900 రూపాయల వద్ద ప్రారంభమై రూ.100 రూపాయలు పైకి చేరుకొని రూ. 55,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను మార్క్ చేసింది.
Also Read: Honor 90 5G launch: 200 MP భారీ కెమేరాతో ఫోన్ లాంచ్ చేస్తున్న హానర్.!
Gold Rate Update
గడిచిన రెండు నెలల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, జూన్ నెల చివరిలో కనిష్ఠాన్ని చూసింది గోల్డ్ మార్కెట్. జూన్ 29వ తేదీ 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 58,750 రూపాయల వద్ద కొనసాగింది. అయితే, జూలై 20 వ తేదీ మాత్రం ఈ రెండు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది గోల్డ్ మార్కెట్. జూలై 20 వ తేదీ మార్కెట్ లో గోల్డ్ రేట్ రూ. 60,750 రూపాయల మార్క్ ను సెట్ చేసింది. ఆ తరువాత నుండి గోల్డ్ రేట్ దాదాపుగా అదే 60 వేల మార్క్ ను బేస్ చేసుకొని కొనసాగుతోంది.
గమనిక: లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ మరియు ఆన్లైన్ గోల్డ్ రేట్ మార్పులు ఉంటాయి.