ఈరోజు పసిడి ప్రియులకు ఊరట లభించింది. నవంబర్ 5 న ఒక్కరోజే 1,000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్, గత రెండు రోజులుగా నిలకడగా ఉండడమే కాకుండా మెల్ల మెల్లగా క్రిందకు దిగుతోంది. మార్కెట్ బంగారం ధర ఒక్కసారిగా పెరిగినా, క్రిందకు మాత్రం నెమ్మదిగా జరుగుతోంది. అయితే, అమాంతంగా పెరిగిన గోల్డ్ రేట్ కొనుగోలుదారులకు భారంగా మారినా ప్రస్తుత మార్కెట్ స్థిరంగా ఉండడంతో కొంత ఊరట లభించింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి.
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,900 రూపాయలుగా ఉండగా, ఈరోజు 100 రూపాయలు క్రిందకు దిగి రూ.46,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,200 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,580 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,900 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.