Gold Price Update: మార్కెట్ లో బంగారం ధర కుప్పకూలిపోతోంది గత 8 నెలల్లో ఎన్నడూ చూడని విధంగా అక్టోబర్ 2023 గోల్డ్ మార్కెట్ లో భారీ డౌన్ ఫాల్ ను చూసింది. అయితే, దీపావళి పండుగ సీజన్ లో బంగారం కొనడం శుభప్రదంగా భావించే పసిడి ప్రియులకు మాత్రం నిజంగా శుభవార్తే ఇది. కానీ, గోల్డ్ ఇన్వెస్టర్లకు మార్కెట్ అప్డేట్స్ గొంతులో ఇరుక్కున్న పచ్చి వెలక్కాయ సామెతగా మారింది.
దేశంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఇందులో గోల్డ్ మార్కెట్ కూడా భాగమే అవుతుంది. ఇప్పుడు నడుస్తున్న గోల్డ్ రేట్ పరంగా, గోల్డ్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. అంటే, బంగారం ధర రోజు రోజుకు క్రిందకు దిగజారుతోంది. గడిచిన నెలలో బంగారం ధర దాదాపుగా స్థిరంగా కొనసాగగా, ఈ నెల ప్రారంభం నుండే బంగారం ధర కనిష్ఠాన్ని నమోదు చేయడం మొదలు పెట్టింది. ఈరోజు కూడా బంగారం ధర 8 నెలల కనిష్ఠ ధరలో కొనసాగుతోంది.
Also Read : Amazon ధమాకా ఆఫర్: iQOO Z7 Pro స్మార్ట్ ఫోన్ కొనాకునే వారికి గుడ్ న్యూస్|New Offer
ఈరోజు దేశంలోని ప్రధాన మార్కెట్ లలో 10gr|| 24 carat బంగారం ధర రూ. 57,370 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు గోల్డ్ ధర స్థిరంగానే కొనసాగుతోంది.
ఈరోజు 10 గ్రాముల 22 carat బంగారం ధర రూ. 52, 590 రూపాయల వద్ద కొనసాగుతోంది మరియు ఈరోజు గోల్డ్ రేట్ స్థిరంగా వుంది.
Also Read : iPhone 13 ఫోన్ పైన GIF Sale ధమాకా ఆఫర్ అనౌన్స్ చేసిన Amazon| Tech News
ఇక సెప్టెంబర్ vs అక్టోబర్ గోల్డ్ విషయానికి వస్తే, సెప్టెంబర్ లో గోల్డ్ మార్కెట్ సెప్టెంబర్ 4వ తేదీ రూ. 60,320 రూపాయల గరిష్ట రేటును, సెప్టెంబర్ 13 మరియు 14 తేదీ లలో రూ. 59,450 రూపాయల కనిష్ట రేటును చూసింది. ఇక అక్టోబర్ విషయానికి వస్తే అక్టోబర్ 1వ తేదీ నుండి గోల్డ్ రేట్ పతనమవుతూనే వుంది. అక్టోబర్ 1 వ తేదీ రూ. 58,200 రూపాయల వద్ద ఉన్న బంగారం ధర భారీగా పతనమై ఈరోజు రూ. 57,370 రూపాయల కనిష్ఠ రేటు వద్ద కొనసాగుతోంది.
Note : ఆన్లైన్ బంగారం ధరలు మరియు లోకల్ బంగారం ధరలలో మార్పులు ఉంటాయి.