Today’s Gold Price: శరవేగంగా పెరుగుతున్న గోల్డ్ రేట్..!
గోల్డ్ మార్కెట్ ఇప్పుడు ఊహించని విధంగా శరవేగంగా పెరిగిపోతోంది
30 రోజుల్లోనే గోల్డ్ రూ. 6,000 పెరిగింది
ఇప్పుడు మరింత భారీ రేటు దిశగా Gold Price దూసుకు వెళుతోంది
Today’s Gold Price: గోల్డ్ మార్కెట్ ఇప్పుడు ఊహించని విధంగా శరవేగంగా పెరిగిపోతోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయి ధరలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ఇప్పుడు మరింత భారీ రేటు దిశగా దూసుకు వెళుతోంది. గోల్డ్ రేట్ ఎంతగా పెరిగిందో చెప్పాలంటే, కేవలం గడిచిన 30 రోజుల్లోనే ఒక తులానికి 6వేల రూపాయల వరకు పెరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈరోజు కూడా గోల్డ్ రేట్ మరింత పైకి చేరుకుంది. ఈరోజు ప్రధాన మార్కెట్ లలో గోల్డ్ రేట్ ఏవిధంగా కొనసాగుతోంది మరియు ఈరోజు గోల్డ్ రేట్ లైవ్ అప్డేట్ లను తెలుసుకుందాం.
Gold Price Update:
గడిచిన నెల రోజుల్లో బంగారం ధర భారిగా పెరిగిపోయింది. గడిచిన నెల రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే బంగారం ధర 6 వేల వరకూ పైగా పెరిగింది. 30 రోజుల క్రితం, అంటే మార్చి 10వ తేదీ 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 66,270 రూపాయల వద్ద కొసాగింది గోల్డ్ మార్కెట్. అయితే, ఈరోజు లైవ్ అప్డేట్ లను చూస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 72,110 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అంటే, కేవలం 30 రోజుల్లో గోల్డ్ మార్కెట్ రూ. 5,840 రూపాయల పెరుగుదలను చూసింది. అంతేకాదు, గోల్డ్ మార్కెట్ ఇప్పటి వరకూ చూడని భారీ హైక్ మరియు హైయెస్ట్ రేటును కూడా నమోదు చేసింది. వాస్తవానికి, గడిచిన 30 రోజుల్లో చివరి 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ బాగా ఊపందుకుంది. ఈ పది రోజుల్లో 69 వేల రూపాయల రేటును నుండి 72 వేల రూపాయల రేటుకు చేరుకుంది.
Also Read: Sony Smart Tv పైన Flipkart Sale జబర్దస్త్ ఆఫర్..!
Today’s Gold Price:
24 Carat Rate
ఇక ఈరోజు ప్రధాన మార్కెట్ లో కొనసాగుతున్న గోల్ రేట్ ను పరిశీలిస్తే, ఈరోజు కూడా గోల్డ్ రేట్ లాబాల బాటలోనే నడిచింది. ఈరోజు రూ. 71,730 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 380 రూపాయలు పెరిగి రూ. 72,110 వద్ద కొసాగుతోంది.
22 Carat Rate
అలాగే, 24 Carat Rate గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ పసిడి రూ. 65,750 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 350 రూపాయలు పెరిగి రూ. 66,100 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
గమనిక: లోకల్ గోల్డ్ రేట్ మరియు ఆన్లైన్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.