todays best Air Cooler Deals from flipkart
Air Cooler Deals: 2025 సమ్మర్ సీజన్ రావడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు అనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే భానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. ఉదయం మరియు సాయంత్రం చెల్లాగా అనిపించినా మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత బాగానే అనిపిస్తుంది. సీజన్ మొదలు కావడానికి ముందుగానే ఇంటిని చల్లబరిచే ఒక మంచి ఎయిర్ కూలర్ ను కలిగి ఉండటం మంచి విషయం. అందుకే, ఈరోజు లభిస్తున్న బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ మీకోసం అందిస్తున్నాము.
ఈరోజు Kenstar, Hindware మరియు LIVPURE బ్రాండ్స్ నుంచి వచ్చిన ఎయిర్ కూలర్లు మంచి ఆఫర్ ధరకు లభిస్తున్నాయి. వీటిలో బెస్ట్ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.
ఎయిర్ కూలర్ విభాగంలో తనదైన పేరు సంపాదించుకున్న Kenstar యొక్క ఈ ఎయిర్ కూలర్ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 49% డిస్కౌంట్ తో రూ. 8,499 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ ఎయిర్ కూలర్ ను BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 849 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ కూలర్ ను కేవలం రూ. 7,650 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ హానీ కోంబ్ ప్యాడ్స్, పెద్ద ఫ్యాన్ మరియు దుమ్మును అడ్డుకునే నెట్ తో వస్తుంది.
హింద్వేర్ యొక్క 85 లీటర్స్ డెజర్ట్ కూలర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 41% డిస్కౌంట్ తో 8,799 ధరకే లభిస్తుంది. ఈ కూలర్ ను BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చెస్ వారికి రూ. 879 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది ఈ డీల్స్ తో ఈ కలర్ ను కేవలం రూ. 7,920 ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ కూలర్ ఐస్ ఛాంబర్, పెద్ద ఫ్యాన్, వాటర్ లెవల్ ఇండికేటర్ మరియు కాస్టర్ వీల్స్ తో వస్తుంది.
Also Read: Jio New Plan: కేవలం రూ. 1,748 కే 336 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ అందించిన జియో.!
ఈ లివ్ ప్యూర్ ఎయిర్ కూలర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 55% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 లిస్ట్ అయ్యింది మరియు ఈ కూలర్ 10% బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ కూలర్ ను Canara, HDFC మరియు HSB కార్డ్స్ ఆఫర్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ కూలర్ ను కేవలం రూ. 7,650 రూపాయల డిస్కౌంట్ ధరకి పొందవచ్చు.80 లీటర్ల పెద్ద ట్యాంక్, పెద్ద ఫ్యాన్ మరియు మల్టీ డైరెక్షనల్ వీల్స్ తో పాటు హానీ కోంబ్ ప్యాడ్స్ కలిగి ఉంటుంది.