కొండెక్కి కూర్చున్న బంగారం..ఈరోజు రేటు ఎంతంటే..!

కొండెక్కి కూర్చున్న బంగారం..ఈరోజు రేటు ఎంతంటే..!
HIGHLIGHTS

మార్కెట్లో గోల్డ్ రేట్ కొండెక్కి కూర్చుంది

గత 10 రోజులుగా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే వుంది

ప్రస్తుత మార్కెట్ లో 52 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది

బంగారం కొనడానికి మార్కెట్ కి వెళుతున్నారా? అయితే, ఒక్కసారి గోల్డ్ మార్కెట్ ఎలాగ ఉన్నదో ఒక్కసారి చూసి వెళ్ళండి. ఎందుకంటే, మార్కెట్లో గోల్డ్ రేట్ కొండెక్కి కూర్చుంది మరియు గత 10 రోజులుగా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే వుంది. మార్కెట్లో బంగారం ధర గత 15 రోజుల క్రితం 49 వేల మార్క్ వద్ద కొనసాగింది. అయితే, ప్రస్తుత మార్కెట్ లో 52 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో పరిశీలిద్దాం.               

Gold Rate:

ఈ నెల ప్రారంభంలో ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉండగా, ఈరోజు 47,840 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.52,190 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,190 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,200 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,390 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo