Today Gold Rate: మెల్లగా పెరుగుతున్న బంగారం ధర.. New Price ఎంతంటే.!
ఈ వారం ప్రారంభం నుండి క్రిందకు దిగుతూ వచ్చిన బంగారం ధర, ఈరోజు మెల్లగా పెరిగింది
గోల్డ్ మార్కెట్ మళ్ళీ రైజింగ్ ను మొదలు పెట్టింది
ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు గోల్డ్ రేట్ వివరాలు ఇవే
Today Gold Rate: ఈ వారం ప్రారంభం నుండి క్రిందకు దిగుతూ వచ్చిన బంగారం నిన్న మరియు ఈరోజు మెల్లగా పెరిగింది. వాస్తవానికి, తులానికి లెక్కిస్తే ఇది పెద్ద పెరుగుదలగా కనిపించదు. అయితే, నష్టాలను చూస్తున్న గోల్డ్ మార్కెట్ ను ఈ రెండు రోజుల అంతర్జాతీయ
మార్కెట్ స్థిమిత పడేలా చేసింది. అంతేకాదు, ఈ నెల ప్రారంభం అవుతూనే డౌన్ ఫాల్ తో మొదలైన గోల్డ్ మార్కెట్, మళ్ళీ రైజింగ్ ను మొదలు పెట్టింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు గోల్డ్ రేట్ వివరాల పైన ఒక లుక్కేయండి.
Today Gold Rate
ఈరోజు గోల్డ్ ధర మరియు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు గోల్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈరోజు గోల్డ్ రేట్ రూ. 61,640 రూపాయల వద్ద మొదలై తులానికి రూ. 110 రూపాయలు పెరిగి రూ. 61,750 వద్దకు చేరుకుంది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో 24 Carat గోల్డ్ రేట్ గోల్డ్ రేట్ రూ. 61,640 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 110 రూపాయలు పెరిగి రూ. 61,750 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : POCO C65: కొత్త లుక్ తో వస్తున్న పోకో New ఫోన్..!
22 Carat గోల్డ్ రేట్
ఇక 22 Carat గోల్డ్ రేట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, రూ. 56,500 రూపాయల వద్ద మొదలై రూ. 100 రూపాయలు పెరిగి రూ. 56,600 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్
ఈ వారం గోల్డ్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను చూసింది. ఎందుకంటే, సోమవారం (అక్టోబర్ 30) నాడు రూ. 62,630 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్ బుధవారం (నవంబర్ 1) వరకూ రూ. 1,200 రూపాయలు క్రిదకు దిగి రూ. 61,530 రూపాయల వద్ద కు చేరుకుంది. అయితే, గురువారం మరియు శుక్రవారం స్వల్పంగా పెరిగింది ఈరోజు రూ. 61,750 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.