Health Insurance యూజర్ల డేటా ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఈ వార్త ఉంటూనే ప్రతి ఒక్కరి నెత్తి మీద పిడుగు పడినట్లయింది. ఇక అసలు విషయానికి వస్తే, ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన Star హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క 3.1 కోట్ల మంది యూజర్ల డేటా ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారట. ఈ విషయాన్ని మెన్లో వెంచర్స్ ఫౌండర్ Deedy Das వెల్లడించారు. ఆయన తన x అకౌంట్ నుంచి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
డీడీ దాస్ ట్వీట్ ప్రకారం, Star హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క 3.1 కోట్ల మంది యూజర్ల డేటాని 1,50,00 డాలర్లు (దాదాపు 1 కోటి 20 లక్షలు) రేటుకు అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. అమ్మకానికి పెట్టిన ఈ డేటా లిస్టులో యూజర్ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోన్ నెంబర్, పాన్ కార్డ్ మరియు జీతం వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా వెల్లడించారు.
అంతేకాదు, ఈ డేటాను Star హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO) అమర్ జీత్ కానూజ ఈ డేటా ని అమ్మడు చేసినట్టు హ్యాకర్ తెలిపినట్లు కూడా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ‘భారతదేశంలో ఏ విషయం కూడా ప్రైవేట్ కాదు’ అని ఎద్దేవా చేశారు.
వాస్తవానికి, హెల్త్ ఇన్సూరెన్స్ బ్రీచ్ అనేది చాలా తీవ్రమైన విషయంగా ఉంటుంది. ఎందుకంటే, హెల్త్ ఇన్సూరెన్స్ లో యూజర్ యొక్క చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది. ఇందులో మెడికల్ రికార్డ్స్, టాక్స్ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబర్, జీతం వివరాలు మరియు పూర్తి మరియు ఖచ్చితమైన అడ్రస్ వివరాలు కూడా ఉంటాయి. ఇంత విలువైన మరియు పూర్తి సెక్యూర్ గా ఉండాల్సిన డేటా ఆన్లైన్లో లీక్ అవ్వడం చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది.
Also Read: MediaTek Dimensity 9400 చిప్ సెట్ ను అల్టిమేట్ AI ఫీచర్స్ తో అనౌన్స్ చేసిన మీడియాటెక్.!
అయితే, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికే డేటా లీకైన టెలిగ్రామ్ చాట్ బోట్ పైన లా సూట్ ఫైల్ చేసింది.