ఈ ఫైబర్ సంస్థ తన వినియోగదారులకి 100GB ఉచిత డేటా ప్రకటించింది

ఈ ఫైబర్ సంస్థ తన వినియోగదారులకి 100GB ఉచిత డేటా ప్రకటించింది
HIGHLIGHTS

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇది ప్రాచుర్యంలో వుంది.

జియో గిగా ఫైబర్ ఈ సంవత్సరంలో రానున్నదని చెబుతున్నపటినుండి అనేక ఫైబర్ సంస్థలు వారి వినియోగదారుల కోసం ఉచిత డేటా, అధిక డేటా మరియు  మంచి అఫర్లను కూడా ప్రకటిస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవలే, దేశంలో 16 నగరాల్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి,  ACT ఫైబర్ వినియోగదారులకి 100GB ఉచిత డేటాని అందించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ బెంగుళూరు కంపేనీ అత్యధికంగా వినియోగదారులని మరియు సర్వీసులను ఎక్కువగా కలిగివుంది మన తెలుసుగు రాష్ట్రాల్లోనే కావడం విశేషం.

మొత్తంగా 16 నగరాల్లో ఇది సేవలను అందిస్తుండగా కేవలం తెలుగు రాష్ట్రలలొనే 10 నగరాలు వున్నాయి. ఇది, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, కోయంబత్తూరు, ఢిల్లీ ఏలూరు,గుంటూరు, కాకినాడ, హైదరాబాదు,మధురై, నెల్లూరు,రాజమండ్రి,తిరుపతి,విజయవాడ,విశాఖపట్నం మరియు వరంగల్ వంటి పట్టణాలలో తన సేవలను అందిస్తోంది.

ముందుగా, ఈ ఫైబర్ సంస్థ తన వినియోదారుల కోసం కొన్ని ప్రత్యేకయిన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ తో ఉచితంగా అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్ ని కూడా అందించింది. ఇప్పుడు కొత్తగా, ఈ 100GB అదనపు డేటాని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఇది కేవలం 500GB మరియు అంతకంటే ఎక్కువ డేటాని పొందే ప్లానలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఈ ఉచిత డేటాని మొబైల్ ఆప్ ద్వారా తమ అకౌంటుకు జత చేసుకోవచ్చు.

హైదరాబాదు వినియోగదారులు , A-MAX 1050, Incridible 1999 మరియు ACT GIGA వంటి బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ తో, అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్ ని  

 ఉచితంగా అందుకోవచ్చు.                           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo