డేటా వార్ కారణంగా, టెలికాం కంపెనీలు వారి టారిఫ్ ప్లాన్ లను రివైజ్ చేయటం ప్రారంభించాయి. ఒక కంపెనీ ఒక కొత్త ప్లాన్ ను అందిస్తే, ఇంకొక కంపెనీ పాత ప్లాన్ ను రివైజ్ చేస్తుంది . గత కొన్ని రోజులుగా ఎయిర్టెల్ చాలాప్లాన్ లను సిద్ధం చేస్తోంది. ఐడియా, వొడాఫోన్ మరియు ఇతర కంపెనీలు కూడా తమ యూజర్స్ ని కొత్త ప్లాన్ ల ద్వారా పెంచాలని ప్రయత్నిస్తున్నాయి . దీపావళికి ముందు రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్ లలో అనేక మార్పులు చేసింది. ఈ కంపెనీ టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచేసింది. దీని తర్వాత కంపెనీ పలు ప్లాన్లను రూపొందించింది.
రూ .149 ప్లాన్ : తన ప్లాన్ ల లో రిలయన్స్ జియో మొదటి మార్పు చేసిన ప్లాన్ 149 రూపాయల ప్లాన్ . రూ 149 కోసం ప్లాన్ ఎంచుకున్న యూజర్ 28 రోజుల కు 2 GB కు బదులుగా 4 GB డేటాను పొందుతారు. కానీ ఈ డేటా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంది. కానీ ఈ డేటా అయిపోయిన తరువాత యూజర్స్ కి డేటా స్పీడ్ తగ్గుతుంది .
309 రూ. ప్లాన్ : కంపెనీ 309 రూపీస్ ప్లాన్ లో వాలిడిటీ తగ్గించి మరియు ఈ ప్లాన్ లో అందుబాటులో ఉన్న డేటాను తగ్గించింది. ఫస్ట్ ఈ ప్లాన్ వాలిడిటీ 56 డేస్ మరి ఇప్పుడు 49 డేస్ వాలిడిటీ వస్తుంది ,దీనిలో ఇప్పుడు 49 జీబీ డేటా లభ్యం . 1జీబీ డేటా డైలీ లిమిట్ తో లభ్యం .
399 రూ. ప్లాన్ :జియో యొక్క ఈ ప్లాన్ ధర 399 రూ నుండి 459 రూపీస్ అయిపోయింది . దీనిలో యూజర్స్ కి 84 డేస్ వాలిడిటీ బదులు 70డేస్ వాలిడిటీ లభ్యం. దీనిలో 70 జీబీ డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD అండ్ రోమింగ్ ఫ్రీ.