Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ కి ఇక మిగిలింది వారం రోజులే.. త్వరపడండి.!
అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా ఆధార్ కార్డ్ నిలుస్తుంది
ఆధార్ ను సరైన వివరాలతో నమోదు చెయ్యాలి
తప్పులు ఉంటే తగిన ఆధారాలతో ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలి
Aadhaar Update: దేశంలో ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా ఆధార్ కార్డ్ నిలుస్తుంది. అందుకే, ఆధార్ ను సరైన వివరాలతో నమోదు చెయ్యాలి. ఒకవేళ ఏదైనా వివరాలలో తప్పులు ఉంటే తగిన ఆధారాలతో ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలి. దీనికోసమే, ప్రభుత్వం ఆధార్ యూజర్లకు ఉచిత ఆధార్ అప్డేట్ అవకాశం అందించింది. అయితే, ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ వారం రోజుల్లో ముగుస్తుంది.
Aadhaar Update
UIDAI ఇటీవల తెలిపిన కొత్త నియమాల ప్రకారం, ఆధార్ తీసుకొని 10 సంవత్సరాలు గడిచిన ప్రతి ఒక్కరూ కూడా వారి కొత్త ప్రూఫ్ వివరాలతో ఆధార్ ను అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది. అయితే, ఈ చర్యను నిర్బంధ చర్యగా కాకుండా సూచన మరియు వినతిగా తెలియచేసింది. ఇలా చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు సర్వీస్ లకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా కొనసాగుతాయి. అందుకే, ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు అయిన యూజర్లు వారి ఆధార్ కార్డ్ ను కొత్త వివరాలతో అప్డేట్ చేసుకోవడం మంచిది.
ఆధార్ కార్డ్ ను ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలి?
ఆన్లైన్ లో ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి https://www.uidai.gov.in వెబ్సైట్ ద్వారా చెయ్యాలి. ఈ సైట్ లో కనిపించే ‘నా ఆధార్’ ట్యాబ్ లో వుండే ‘మీ ఆధార్ అప్డేట్ ను అప్డేట్ చేయండి’ ఆప్షన్ పైన నొక్కాలి. ఇందులో ‘మీ ఆధార్ డేటాని నవీకరించండి’ పైన నొక్కండి. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి, OTP రిక్వెస్ట్ పంపండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ద్వారా పేజ్ లోకి చేరుకొని అడిగిన వివరాలు మరియు సపోర్ట్ డాక్యుమెంట్స్ తో మీ ఆధార్ అప్డేట్ ను పూర్తి చేయవచ్చు.
Also Read: One Community Sale నుంచి వన్ ప్లస్ కొత్త ఫోన్ల పైన ధమాకా ఆఫర్లు.!
సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏమిటి?
మీ వివరాలను అందించిన తర్వాత వాటికి తగిన సపోర్ట్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. ఇందులో, రేషన్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్, లేదా ఏదైనా ప్రభుత్వ నియమిత ఐడెంటిటీ కార్డ్ ను అందించవచ్చు. వీటితో పాటుగా, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా స్కూల్ సర్టిఫికెట్ లను కూడా అందించవచ్చు.
ఒకవేళ మీరు అడ్రస్ మారినట్లయితే లేదా అద్దె ఇంటి అడ్రస్ మారినా కూడా మీ అడ్రస్ కి సంబంధించిన పత్రాలను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం, రెంట్ అగ్రిమెంట్, కరెంట్ బిల్లు మరియు వాటర్ బిల్లు వంటి పత్రాలను అందించాలి.
ఒకవేళ మీరు మీ ఆధార్ అప్డేట్ ఆన్లైన్ లో చెయ్యలేక పోతే, మీ దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా కూడా ఈ అప్డేట్ ను చేయవచ్చు. ఈ సర్వీస్ జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అయితే, ఆధార్ కేంద్రంలో చెల్లించ వలసిన సర్వీస్ ఛార్జ్ బహుశా చెల్లించాల్సి ఉండవచ్చు.