ఫ్యూచర్ లో రానున్న కొత్త WiFi టెక్నాలజీ

Updated on 19-Jan-2016

మన దేశంలో ఇప్పటివరకు పబ్లిక్ WiFi వినియోగం అనేది చాలా తక్కువ. ఉన్న ప్రదేశాలు కేవలం మెట్రో సిటీస్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే. అయితే ఇండియాలో ఇప్పుడు స్మార్ట్ సిటీస్ రానున్నాయి. స్మార్ట్ అంటే మినిమమ్ స్మార్ట్ విషయం.. అందరినీ ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయించటం. సో ఇండియా అంతటా పబ్లిక్ వైఫై లు రానున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ అని ప్రతి పాదించిన సిటీస్ లో. మన తెలుగు రాష్ట్రాలలో కూడా స్మార్ట్ సిటీస్ ఏర్పడతున్నాయి.

ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ లో ఉన్న పబ్లిక్ వైఫై హాట్ స్పాట్స్ కు కనెక్ట్ కావాలంటే ముందుగా లాగిన్ అయ్యి, మొబైల్ కు వచ్చే OTP ను ఎంటర్ చేయాలి. ఇది డిల్లీ. ముంబాయి వంటి రద్దీ ప్రదేశాలలో అస్సలు పని చేయటం లేదు. కారణం లాగిన్ ప్రోసెస్ కు చాలా మంది లైన్ లో ఉండటం. ఇక ఈ లాగిన్ లేదా సైన్ అప్ ప్రోసెస్ ను తీసివేసి, అదే సెక్యురిటీ తో కొత్తగా Next Generation WiFi Hotspot అనేది వస్తుంది.

Next Generation WiFi Hotspot / Hotspot 2.0

దీని గురించి ముందుగా మీకు తెలియవలసినది..
1. ఇది bandwidth స్పీడ్ ను పెంచదు, కాని లాగిన్ ప్రోసెస్ ను eliminate చేసి కనెక్ట్ అవ్వటానికి ట్రాఫిక్ తగ్గిస్తుంది. అంటే మీరు వైఫై ఉన్న పబ్లిక్ ప్రదేశాలకు వెళ్ళిన వెంటనే మొబైల్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయిపోతుంది.

2. ఇండియన్ గవర్నమెంట్ దీనిపై శ్రద్ద చూపిస్తుంది.

 

ఏలా పని చేస్తుంది?

NGH(Next Generation WiFi Hotspot)  passpoint అనే టెక్నాలజీ పై పనిచేస్తుంది. passpoint అంటే certification. మీ వద్ద ఉన్న మొబైల్ 802.1x మరియు 802.11u ఫంక్షన్స్ కలిగి ఉంది అని.

అయితే ఇది గవర్నమెంట్ సెట్ అప్ చేసినా, మీ మొబైల్స్ కూడా NGH ను సపోర్ట్ చేయాలి, ఈజీగా కనెక్ట్ కావలి అనుకుంటే. అయితే ఆల్రెడీ చాలా బ్రాండ్స్ మరియు మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ దీనిని సపోర్ట్ చేయగలవు. 

నెట్ వర్క్ ఆపరేటర్స్ చేయవలసినదల్లా NGH సపోర్ట్ ను implement చేయటమే. ఇందుకు అదనంగా ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అని ఈ టెక్నాలజీ ను ఇండియాలోకి తీసుకువస్తున్న Wireless Broadband Alliance (WBA) సీఈఓ, శ్రీకాంత్ చెబుతున్నారు.

శ్రీకాంత్ స్వయంగా కాలిఫోర్నియా పర్యటించిన సమయంలో దీనిని గమనించి మన దేశంలో implement చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది WPA2 సెక్యురిటీ తో పనిచేయనుంది. సామ్సంగ్ గేలక్సీ S3 వంటి డివైజెస్ NGH కు సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, కొత్తగా సెట్ అప్ చేయనవసరం లేదు, జస్ట్ ఆచరణలో పెడితే చాలు. S3 2012 లో రిలీజ్ అయ్యింది, మరి ఇక ఇప్పటి ఫోన్స్ కు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. 

ఓవర్ ఆల్ గా ఇది పని చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్స్ టెక్నాలజీ implementation మరియు మైక్రో సాఫ్ట్, గూగల్ వంటి దిగ్గజాల alliance అవసరం. ఎందుకంటే దేశంలో రైల్వే జోన్స్ లో వైఫై ను అందించే బాధ్యతలు ఇవి తీసుకున్నాయి.

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Connect On :