149 రూ లకే 15MBPS ఫైబర్ ఇంటర్నెట్ ను ఇస్తున్న తెలుగు రాష్ట్రం

Updated on 18-Mar-2016

ఆంధ్రప్రదేశ్ లో Fiber Grid ప్రాజెక్ట్ మొదలయ్యింది అని గతంలో చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు అది పూర్తి అయ్యింది దాదాపు. గురువారం ఆంద్ర cm చంద్రబాబు మొదటి phase ను లాంచ్ చేశారు. అయితే users కు మాత్రం ఇంకా రాలేదు.

పేరు AP FibreNet. దీని ద్వారా బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్ ను హై స్పీడ్ లో వస్తుంది. స్పీడ్ ఒకటే కాదు ప్రైస్ కూడా తక్కువే. నెలకు149 రూ ల pay చేస్తే ఇంటికి 15MBPS కనెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్.

అలాగే ఆఫీస్ లలో కూడా నెలకు 999 రూ pay చేస్తే 100MBPS బ్రాండ్ బాండ్ కనెక్షన్ వస్తుంది. ఇది మొదటిగా ఏప్రిల్ నుండి విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం లో మొదలు కానుంది.

మిగిలిన సిటీస్ లో జులై నాటికి అందుబాటులోకి వస్తుంది ఫైబర్ నెట్ బ్రాడ్ బాండ్ సర్విస్. ఇందుకు అండర్ గ్రౌండ్ లో కేబుల్స్ వేయకుండా ఖర్చు తగ్గించేందుకు ఎలెక్ట్రికల్ పోల్స్ వాడనుంది govt.

త్వరలోనే వైజాగ్ లో Cisco కంపెని తో కలిసి ఇంటర్నెట్ ఆఫ్ everything (IoE) సెంటర్ కూడా తెరవనుండ్. ఇది స్టార్ట్ అప్స్ మరియు కొత్త టెక్నికల్ సల్యుషణ్స్ ను ఎంకరేజ్ చేయటానికి ఉపయోగపడుతుంది.

అయితే ఒక పక్క రిలయన్స్ ఫైబర్ కేబుల్స్ వేసి హై స్పీడ్ 4G ఇంటర్నెట్ ను అందరికీ అందుబాటులో తెచ్చే సమయంలో AP ఫైబర్ నెట్ ఇంత తక్కువ ప్రైస్ కు అదే తరహ ఇంటర్నెట్ సర్విస్ ఇవ్వటం విశేషం. ఇద్దరిలో ఎవరిది నాణ్యతగా ఉంటుందో వేచి చూడాలి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :