ఇక నుండి తెలుగు అక్షరాలతో కూడా ఈమెయిలు అడ్రెస్ లను క్రియేట్ చేయగలరు

Updated on 22-Dec-2016

8 భారతీయ భాషలలో e-mail అడ్రెస్ లను free గా క్రియేట్ చేసుకునే ఆఫర్ అందిస్తుంది BSNL ​. ఇది DataMail అనే యాప్ ద్వారా సాధ్యం అవుతుంది.

Datamail అనేది జైపూర్ లోని కంపెని, దానితో BSNL పార్టనర్ షిప్ కుదుర్చుకుని ఈ మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ మెయిల్ అడ్రెస్ అందిస్తుంది.

ఇందుకు మీరు BSNL బ్రాండ్ బాండ్ యూసర్ అయినా అవకపోయినా ఫర్వాలేదు. అందిరకీ పనిచేస్తుంది. సో gmail.com మాదిరిగా ఆ ప్లేస్ లో dataone.bharat అనేది ఉంటుంది. ఇక ఐడి మాత్రం మీ భాషలో ఏదైనా పెట్టుకోగలరు.

ఏలా చేయాలి?

  • ఈ లింక్ పై క్లిక్ చేసి datamail అనే యాప్ ను ఇంస్టాల్ చేయండి మీ ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఫోన్ లో.
  • ఇంస్టాల్ చేసిన తరువాత ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని అడిగి OTP పంపిస్తుంది.
  • అది ఫిల్ చేస్తే మిమ్మల్ని కొత్త ఈమెయిలు ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆటోమాటిక్ గా మీకు తెలుగు కీ బోర్డ్ ఓపెన్ అవుతుంది యాప్ నుండి.
  • సో తెలుగు అక్షరాలతో మీకు నచ్చిన ఐడి క్రియేట్ చేస్తే 30 సేకేండ్స్ లోపు మీ ఈమెయిలు లిస్టు కూడా ఓపెన్ చేస్తుంది యాప్.
  • మీరు క్రియేట్ చేసుకున్న ఈ కొత్త ఐడి కు వచ్చే emails అన్నీ ఇక్కడే ఈ యాప్ ద్వారానే చూసుకోవాలి.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :