మొబైల్ ఫోన్లు మరియు టవర్లు నుండి విద్యుదయస్కాంత క్షేత్రం (EMF) ఉద్గారాల ఆరోపణలకు గురైన యాంటీ-సైంటిఫిక్ వైఖరిని ప్రోత్సహించడానికి రాబోయే రజనీకాంత్ మరియు అక్షయ్ కుమార్ నటించిన 2.0 భారతదేశం యొక్క సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (COAI) నుండి నిరసనలను ఎదుర్కుంటోందీ. S శంకర్ దర్శకత్వంలో, నిర్మాత ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 2010 లో వచ్చిన యన్తిరన్(రోబో) చిత్రానికి రెండవ భాగం ఈ చిత్రం . ఇది ఇప్పటి వరకు భారతదేశంలో తయారు చేయబడిన అత్యంత ఖరీదైన చిత్రం మరియు దీని యొక్క ఉత్పత్తి ధర ($ 75,000,000) ద్వారా తొమ్మిదవ అత్యంత ఖరీదైన ఆంగ్ల-భాషా చిత్రం. ట్రైలర్ యొక్క దృశ్యం నుండి, ఈ సైన్స్ ఫిక్షన్ చలన చిత్రంలో, పక్షుల అధ్యయనం మరియు పక్షులపై మొబైల్ టవర్లు మరియు మొబైల్ ఫోన్ల నుండి విద్యుదయస్కాంత క్షేత్ర ఉద్గారాల ప్రతికూల ప్రభావాలను అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా, అక్షయ్ కుమార్ డాక్టర్ క్రోలో పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది.
EMAI ఉద్గారాలు మానవులకు లేదా జంతువులకు ఎలాంటి హాని కలిగించవు అనడానికి COAI ఒక బలమైన సిద్ధాంతాన్నీ కలిగివుంది. ఈ ఇండస్ట్రీ బాడీ – "ఇప్పటి వరకు సేకరించబడిన చాలా తక్కువ స్థాయి ప్రభావాలు మరియు పరిశోధనా ఫలితాలను పరిశీలిస్తే, బేస్ స్టేషన్లు మరియు వైర్లెస్ నెట్వర్క్ల నుండి బలహీనమైన RF సిగ్నల్స్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు కారణమవుతాయని విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారం లేదు." అనితెలిపిన, WHO పరిశోధనా నివేదికను పేర్కొంది. ఇప్పుడు COAI, దాని టీజర్స్, ట్రైలర్స్ మరియు ఇతర ప్రమోషనల్ వీడియోలతో సహా ఈ 2.0 చిత్రం, మొబైల్ ఫోన్లు మరియు మొబైల్ టవర్లను, అపవాదు పద్ధతిలో చిత్రీకరించినట్లు ఆరోపించింది. "మొబైల్ ఫోన్లు మరియు టవర్లు నుండి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రం (EMF) ఉద్గారాలు, పక్షుల మరియు మానవులు, అలాగే పూర్తి పర్యావరణానికి హానికరమైనవని, ఈ మొబైల్ టవర్లు మరియు మొబైల్ ఫోన్లుని తప్పుగా చెప్పటంవలన అసంబంధమైన భయం మరియు భయాందళనలను సృష్టిస్తుంది. "అని COAI యొక్క డైరెక్టర్ జనరల్, రాజన్ మాథ్యూస్ ఒక ప్రకటన పత్రంలో రాశారు.
ఈ పరిశ్రమకు, దాని సభ్యులకు ఇది అపహాస్యం అని COAI ఆరోపించింది. భారతదేశం యొక్క అన్ని టెలికాం ఆపరేటర్లందరికి ప్రాతినిధ్యం వహించే ఈ బాడి, ఈ చిత్రం 2.0 "ప్రజారోగ్యానికి భంగం కలిగించేదని తెలిపే, శాస్త్రీయ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుంది, అలాగే IPC (ఇండియాన్ పీనల్ కోడ్) లోని వివిధ విభాగాల పరిధిలో నేరాలు కలిగి ఉంటాయి మరియు 1952, సినిమాటోగ్రాఫ్ చట్టం యొక్క నిబంధనలను ఉల్లంఘించాయి. ఇది సెక్షన్ 268 (పబ్లిక్ న్యూసెన్స్), సెక్షన్ 505 (పబ్లిక్ అల్లర్లకు సంబందించిన ప్రకటనలు) మరియు IPC యొక్క సెక్షన్ 499 (పరువు నష్టం) మరియు మొబైల్ టవర్లు ఎటువంటి హానికరమైన ప్రభావాలను కలిగి ఉన్నాయా లేదా అనేదాని మీద, గౌరవనీయమైన భారతదేశ సుప్రీం కోర్టు విచారణ చేస్తుంది. "
పైన చెప్పిన కారణాల వలన COAI, సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ను ఈ టీజర్, ట్రైలర్ మరియు ఇతర ప్రోత్సాహక వీడియో మరియు తమిళ భాషా వెర్షన్ కోసం ఇచ్చిన ధృవీకరణను ఉపసంహరించాలని కోరింది. ప్రతినిధి బృందం ఈ చిత్రం యొక్క ప్రదర్శన పెండింగ్లో ఉన్న రివ్యూ ను నిలిపివేయాలని కోరింది మరియు మరింత సమాచారం మరియు పరీక్ష కోసం ఈ చిత్రం యొక్క కాపీని COAI కు అందించాలని పేర్కొంది.