టెలినార్ కంపెనీ రెండు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో విడుదల చేసింది

Updated on 28-Jun-2017

టెలినార్  కంపెనీ  రెండు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో విడుదల  చేసింది.  వీటియొక్క  ధరలు  వరుసగా  రూ.116, రూ.146 రేంజ్‌లలో అందుబాటులో వున్నాయిఎవరైతే  టెలినార్ యూజర్లు రూ.116 ప్యాక్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకుంటే  28  వాలిడిటీ  తో  రోజుకు 1జీబి డేటా  పొందవచ్చు . కాల్స్  చూస్తే  రూ.116 ప్యాక్ లో ఉన్న టెలినార్ టు టెలినార్ నెట్‌వర్క్ మధ్య  అన్లిమిటెడ్  కాల్స్ చేసుకోవచ్చుఇక రెండవ  రూ.146 ప్యాక్‌లో  చూస్తే  టెలినార్ టు టెలినార్  అపరిమిత  కాల్స్‌తో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు 400 నిమిషాలు అందుబాటులో ఉంటాయిఫ్రీ  రోమింగ్, ఫ్రీ  మెసేజెస్ వంటి అదనపు సౌకర్యాలు ఈ ప్లాన్‌లలో  వుండవు  టెలినార్‌కు దేశవ్యాప్తంగా 5.4 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.ఈ ప్లాన్‌లు ఆంధ్రప్రదేశ్, తెలింగాణ సర్కిళ్లతో పాటు గుజరాత్, మహారాష్ట్రా, గోవా, బిహార్, జార్కండ్, ఉత్తర్‌ప్రదేశ్ ఈస్ట్, ఉత్తర్‌ప్రదేశ్ వెస్ట్ సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :