విడ్డూరం: 100 మంది పిల్లలకు తండ్రైన Telegram CEO.. ఉచిత IVF ప్రకటన కూడా అనౌన్స్.!

విడ్డూరం: 100 మంది పిల్లలకు తండ్రైన Telegram CEO.. ఉచిత IVF ప్రకటన కూడా అనౌన్స్.!
HIGHLIGHTS

ఉచిత IVF ప్రకటనతో పావెల్ పేరు మారుమోగిపోయింది

ఒక న్యూస్ తో అందరి నోళ్లలో నానుతున్న Telegram CEO

టెలిగ్రామ్ సీఈఓ ఇప్పటికే 100 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యారు

విడ్డూరం: గత కొన్ని నెలలుగా ఏదో ఒక న్యూస్ తో అందరి నోళ్లలో నానుతున్న Telegram CEO పావెల్ దురోవ్ ఇప్పుడు మరొక కొత్త న్యూస్ తో కనిపించారు. ఇప్పుడు వచ్చిన కొత్త న్యూస్ మాత్రమే విడ్డూరమే అని చెప్పాలి. ఎందుకంటే, ఈసారి ఉచిత IVF ప్రకటనతో పావెల్ పేరు మారుమోగిపోయింది. ఏంటా కొత్త విడ్డూరమైన న్యూస్ అనుకుంటున్నారా? పదండి అదేమిటో చూద్దాం.

ఏమిటా Telegram CEO న్యూస్?

రష్యా బేస్డ్ IVF సంస్థ AltraVita IVF సెంటర్ ఐవిఎఫ్ తో పిల్లల్ని కనడానికి చూస్తున్న మహిళల కోసం కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కి టెలిగ్రామ్ సీఈవో కి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సదరు ఐవీఎఫ్ సెంటర్ అత్యంత ఖరీదైన ఐవిఎఫ్ ప్రోసిజర్ ను ఉచితంగా అందిస్తుందని ప్రకటించింది.

అయితే, ఇది అందరికీ కాదనుకోండి. కేవలం టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ స్పెర్మ్ తో ఐవిఎఫ్ చేయించుకునే వారికి మాత్రమే ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుందట. ఆశ్చర్యం ఏమిటంటే, ఇప్పటికే ఈ ఆఫర్ అందుకున్న 100 మందికి పైగా స్త్రీలు ఐవీఎఫ్ చేసుకున్నట్లు కూడా ఈ క్లినిక్ తెలిపింది. అంటే, టెలిగ్రామ్ సీఈఓ ఇప్పటికే 100 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యారు.

వాస్తవానికి, తన స్పెర్మ్ తో IVF చేయించుకునే మహిళలకు ఆ ప్రోసిజర్ కు అయ్యే ఖర్చు పావెల్ భరిస్తారని తెలిపారు. నిజానికి ఈ ఐవిఎఫ్ ప్రోసిజర్ కోసం వేలకొద్దీ డాలర్లు ఖర్చు అవుతుంది. “Free IVF with Pavel Durov’s donated sperm” అని కంపెనీ యాడ్ చేస్తోంది.

Also Read: LG Stretchable Display: కొత్త రకం డిస్ప్లే ని ఆవిష్కరించిన ఎల్ జి ఎలక్ట్రానిక్స్.!

ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది అనుకోకండి. ఈ చర్యతో కొన్ని తరాల వరకు తన DNA ను కొనసాగించవచ్చనేది పావెల్ ఆలోచన అని చెబుతున్నారు. అయితే, ఇది అనుకున్నంత ఈజీ కాదని మరికొందరు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే, పెరుగుతున్న సైన్ మరియు టెక్నాలజీ సహకారంతో ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo