వినియోగదారులు తమ సౌలభ్యం ప్రకారం ప్లాన్ ను ఎన్నుకోవటానికి ఆప్షన్స్ వున్నాయి . కొందరు వినియోగదారులు ఇంటర్నెట్ ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు మరియు మీరు వారిలో ఒకరు అయితే, ఇక్కడ 2 GB డేటాతో వచ్చిన అన్ని టెలికం కంపెనీల ప్లాన్ల గురించి చెప్తున్నాము . ఇక్కడ మీ కోసం ఏ ప్లాన్ ఉత్తమం అని మీరు చూడవచ్చు.
ఎయిర్టెల్ రూ 349 ప్లాన్-
ఈ లిస్ట్ లో మొదటగా ఎయిర్టెల్ రూ 349 ప్లాన్ చూస్తే ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది . ఈ ప్లాన్ లో, వినియోగదారులు అపరిమిత లోకల్ , STD రోమింగ్ వాయిస్ కాల్స్ పొందుతారు.ఇదే కాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్ లో రోజువారీ 100 SMS ను పొందుతారు.డేటా గురించి మాట్లాడుతూ, ఎయిర్టెల్ యొక్క 349 రూపాయల ప్లాన్ లో మొదట వినియోగదారులు 4G స్పీడ్లో 2Gb డేటాను పొందారు. కంపెనీ ఈ ప్లాన్ ను రివైజ్ చేసింది , దీని తరువాత వినియోగదారులకు ప్రతిరోజు 2.5GB డేటాను అందిస్తున్నారు. అంటే ఈ ప్లాన్లో వినియోగదారులు మొత్తం 70 GB డేటాను పొందుతారు.
జియో యొక్క 198 మరియు 398 రూపాయల ప్లాన్స్ – .
మరింత ఇంటర్నెట్ డేటాను ఉపయోగించే తన వినియోగదారులకు 2 GB డేటాను అందించే రెండు ప్లాన్ లను జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లలో మొదటిది రూ. 198, దీనిలో యూజర్ రోజుకు 2 GB డేటాను 28 రోజులకు పొందుతాడు. ఈ ప్లాన్లో మొత్తం 56 GB డేటాను వినియోగదారులు పొందుతారు. దీనితో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , ఎస్టీడీ, రోమింగ్) మరియు ప్రతిరోజూ 100 SMS లు అందుతాయి. జియో యొక్క రూ 398 ప్లాన్ లో వినియోగదారుడు 4G స్పీడ్ వద్ద ప్రతి రోజు 2 GB డేటాను పొందుతాడు. దీనితో పాటు, ఈ ప్లాన్లో ముందర ప్లాన్ లాంటి లాభాలు మీకు లభిస్తాయి. అయితే, ఈ ప్లాన్ , మునుపటి ప్లాన్ లా కాకుండా, 70 రోజుల విలువతో వస్తుంది.
వోడాఫోన్ యొక్క రూ 349 ప్లాన్
వోడాఫోన్ యొక్క రూ 349 ప్లాన్లో, వినియోగదారులు 3G / 4G స్పీడ్ తో 2GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. దీనితో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , ఎస్టీడీ, రోమింగ్) మరియు ప్రతిరోజూ 100 SMS లు అందుతాయి. కంపెనీ ఇటీవల ఈ ప్లాన్ ను రివైజ్ చేసింది . దీనికి ముందు, ఈ ప్లాన్లో వినియోగదారులకు రోజువారీ 1 GB డేటాను అందించేది.
ఐడియా యొక్క 357 రూపీస్ ప్లాన్ –
2 జిబి డేటాతో ఐడియా యొక్క టారిఫ్ ప్లాన్ ఇప్పుడు 357 రూపాయలలో వస్తుంది, దీనిలో ప్రతిరోజూ 2GB డేటా 3G / 4G స్పీడ్ తో పొందుతారు. అనగా యూజర్ మొత్తం 56 GB డేటా పొందుతారు . మిగిలిన ప్లాన్ల లాగే, ఐడియా యొక్క ప్లాన్ కూడా అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , ఎస్టీడీ, రోమింగ్) మరియు 100 SMS లను రోజువారీ అందిస్తుంది. ఈ ఐడియా ప్లాన్లో, వినియోగదారులు ఐడియా వెబ్సైట్ లేదా ఐడియా యాప్ నుంచి రీఛార్జ్ చేసిన తర్వాత 28 రోజులపాటు 100 శాతం క్యాష్ బ్యాక్ మరియు 1GB అదనపు డేటా ఆఫర్ పొందుతారు.