శ్రీలంక దేశంలో 17 ఏళ్ల టీనేజర్ ప్రెసిడెంట్ Maithripala యొక్క అఫీషియల్ వెబ్ సైట్ ను హాకింగ్ చేయటం జరిగింది. hack చేయటం వెనుక కారణం exams.
అవును శ్రీలంక గవర్నమెంట్ వెబ్ సైట్ హాక్ చేయటం జరిగింది. సడెన్ గా వెబ్ సైట్ లోని అసలు homepage అంతా మారిపోయి "GCE advanced లెవెల్ పరీక్షలను వాయిదా వేయండి లేదా పదవి నుండి వైదొలగండి" అని మెసేజ్ కనిపించింది.
వెంటనే అధికారులు అప్రమత్తంగా శోధన చేయగా Kadugannawa అనే ఏరియా లోని ఇంటి నుండి ఈ hack జరిగింది అని కనుగొన్నారు పోలీసులు.
hack చేసిన అబ్బాయికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు సుమారు ఒక లక్షా 35 వేలు జరిమానా కూడా విధించారు. గతంలో కూడా ఇలాంటి hacks జరిగాయి శ్రీలంక లో కానీ కంప్యూటర్ crimes act క్రింద టీనేజర్ ను అరెస్ట్ చేయటం మొదటి సారి.