OTT లో లేటెస్ట్ గా విడుదలైన ఈ కొత్త సినిమాలు మిస్ అవ్వకండి.!

Updated on 09-Sep-2022
HIGHLIGHTS

OTT లో లేటెస్ట్ గా విడుదలైన ఈ కొత్త సినిమాలు

థోర్ లవ్ అండ్ థండర్ తో సహా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి

సీతారామం కూడా ఈరోజు నుండి స్ట్రీమ్ అవుతోంది

OTT లో లేటెస్ట్ గా విడుదలైన ఈ కొత్త సినిమాలు కోసం చూస్తున్నారా? అయితే, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలను మిస్ అవ్వకండి. ఈ వారం హాలీవుడ్ సినిమా థోర్ లవ్ అండ్ థండర్ తో సహా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఓటీటీలో సందడి చేస్తున్న ఆ కొత్త సినిమాలు ఏమిటో తెలుసుకోండి.

థోర్ లవ్ అండ్ థండర్

మార్వెల్ కామిక్స్ ఆధారంగా చిత్రించిన అమెరికన్ సూపర్ హీరో మూవీ 'థోర్ లవ్ అండ్ థండర్' నిన్న OTT లో రిలీజ్ అయ్యింది. థోర్ ర్యాంగ్ రాక్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 8 నుండి Disney+ Hotstar లో స్ట్రీమ్ అవుతోంది.

సీతారామం

హను రాఘవపూడి ప్రేమ కథా చిత్రం 'సీతారామం' కూడా ఈవారం OTT లో రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, సుమంత్, మృణాల్ ఠాకూర్ మరియు రష్మిక మందాన నటించిన ఈ చిత్రం ఇటీవలే హిందీలో డబ్ చేసి రిలీజ్ చెయ్యబడింది మరియు హిందీ వెర్షన్ మంచి కలక్షన్ లను కూడా సాధిస్తోంది. అయితే, ఈ చిత్రం సెప్టెంబర్ 9, అంటే ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

7 డేస్ 6 నైట్స్

M.S రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ మరియు రోహన్ హీరోలుగా రూపొందిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. నేటి యువత కొత్త తరం పోకడల మధ్య సాగే రొమాంటిక్ సినిమా. ఈ సినిమా జూన్ 24 న థియేటర్లలో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న, అంటే ఈరోజు నుండి AHA లో స్ట్రీమ్ అవుతోంది.

మహా

హన్సికా మోత్వానీ నటించిన లేటెస్ట్ క్రైం థ్రిల్లర్ సినిమా 'మహా' OTT లో రిలీజ్ అవుతోంది. జూలై 22 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు OTT బాట పట్టింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ కూడా AHA లో సెప్టెంబర్ 9, అంటే ఈరోజు నుండి స్ట్రీమ్ అవుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :