OTT: ఒటిటి లో స్ట్రీమ్ అవుతున్న కొత్త సినిమాలు.. చూశారా.!

Updated on 21-Oct-2022
HIGHLIGHTS

ఈ వారం OTT లో సరికొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి

మొత్తం నాలుగు కొత్త సినిమాలు OTT లో రిలీజ్ చెయ్యబడ్డాయి

దీపావళి సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది

ఈ వారం OTT లో సరికొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ వారం ఇప్పటి వరకూ మొత్తం నాలుగు కొత్త సినిమాలు OTT లో రిలీజ్ చెయ్యబడ్డాయి. వీటిలో, నందమూరి కళ్యాణ్ రామ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'బింబిసార' సినిమా కూడా వుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం' కూడా ఈరోజు నుండి ఒటిటి లో స్ట్రీమ్ అవుతోంది. మరి కొత్తగా ఒటిటి లో రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అవుతున్న ఈ కొత్త సినిమా ముచ్చట్లు చూద్దామా.

బింబిసార

కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ పైన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినీమా మంచి వసూళ్లను సాధించడమే కాకుండా ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశారు మరియు కేథరిన్ హీరో ఇన్ గా నటించారు. క్రీస్తు పూర్వం 500 కాలం గురించి అప్పటి విషయాలను పూసగుచ్చినట్లు ఈ సినిమాలు చూపించారు. ఈ సినిమా ఈరోజు నుండి ZEE5 లో స్ట్రీమ్ అవుతోంది.

ఒకే ఒక జీవితం

శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం' కూడా ఈరోజు నుండి ఒటిటి లో స్ట్రీమ్ అవుతోంది. శర్వానంద్, అక్కినేని అమల, వెన్నెల కిశోర్ మరియు ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 9 న థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ సాధించిన ఈ సినిమా, ఈరోజు నుండి SonyLiv లో స్ట్రీమ్ అవుతోంది. 

కపట నాటక సూత్రధారి

కొత్త కథాంశం తో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కపట నాటక సూత్రధారి' కూడా ఒటిటి లో రిలీజ్ అయ్యింది. విజయ్ శంకర్, సంపత్ కుమార్, భానుచందర్, అమీక్ష తారాగణం నటించిన ఈ సినిమా నవంబర్ 12 న సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కపట నాటక సూత్రధారి ఈరోజు నుండి Aha లో స్ట్రీమ్ అవుతోంది.

అమ్ము

అమెజాన్ ఒరిజనల్ మూవీ 'అమ్ము'  అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమ్ అవుతోంది. ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర నటించిన ఈ సినిమా ట్రైలర్ పరంగా మంచి అంచనాలను అందుకుంది. నేటి కాలంలో మహిళ పైన సాధారణంగా జరిగే గృహ హింసను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ఓవరాల్ గా ఒకే అనిపిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :