తాజాగా ఇంటర్నెట్ లో Jio పై false ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ అవటంతో చాలామంది దీనిపై మెసేజెస్ చేస్తున్నారు. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వటానికి ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది.
లేటెస్ట్ రూమర్ విషయానికి వస్తే … Jio సర్వీసెస్, 3G మరియు 2G ఫోన్లపై కూడా సపోర్ట్ చేస్తాయి అనేది ఈ రూమర్. అయితే దీనిలో వాస్తవం లేదు. ఎలా పనిచేస్తుంది అని కూడా తెలిపి ఉంది ఆ false సమాచరం లో…
సో రూమర్ లో ఉన్న దాని ప్రకరం JioFi అప్లికేషన్ ఫోన్ లో ఇంస్టాల్ చేసుకొని, రిలయన్స్ యొక్క Jio4G VoLTE వాయిస్ కాలింగ్ సపోర్ట్ చేసే యాప్ ను ఇంస్టాల్ చేస్తే పనిచేస్తుంది అని ఉంది.
ఇక్కడ స్పష్టం చేయవలసిన విషయం ఏంటంటే JioFi అనేది సాఫ్ట్ వేర్ యాప్ కాదు, JioFi అనేది హార్డ్ వేర్ router. హాట్ స్పాట్ డివైజ్ ఇది. మీరు పైన దీని ఇమేజ్ చూడగలరు. 3G/2G ఫోనుల్లో సిమ్ వేసుకొని Jioను వాడటం కుదరదు.