ముఖ్యాంశాలు:
1. ట్రెండ్ మైక్రో గూగుల్ ప్లే స్టోర్లో గూఢచారిని కనుగొనట్లు పేర్కొంది.
2. వాటిలో కొన్ని దాదాపు 100,000 వరకూ డౌన్లోడ్ చేయబడ్డాయి.
3. భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన వినియోగదారులను కలిగివుంది.
జపాన్ కు చెందిన ఐటీ సెక్యూరిటీ కంపెనీ అయినటువంటి ట్రెండ్ మైక్రో, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఒక స్పైవేర్ను గూగుల్ ప్లే స్టోరులో కనుగొంది. వీటిలో కొన్ని స్పైవేర్ ఆప్స్ దాదాపుగా 100,000 సార్లు కంటే ఎక్కువగానే, వినియోగదారుల ద్వారా డౌన్లోడ్ చేయబడుతున్నాయని మరియు ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన దేశంగా భారతదేశం నిలుస్తుందని వాదిస్తున్నారు. ఈ స్పైవేర్ (ANDROIDOS_MOBSTSPY గా కనుగొనబడింది) అలాగే ఈ Android Apps చట్టబద్ధమైనవని చెప్పుకుంటూ,ఈ అనువర్తనాలు 2018 లో Google ప్లేలో డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ట్రెండ్ మైక్రో నుండి ఎక్యూలార్ జు మరియు గ్రే గ్వో ప్రకారం, "మొదట పరిశోధన చేసిన ఆప్లలో ఒకటి Flappy Birr Dog అని పిలిచే ఒక గేమ్ ఆప్. ఇతర అనువర్తనాలు FlashLight, HZPermis Pro Arabe, Win7imulator, Win7Launcher మరియు Flappy బర్డ్ వంటివి ఉన్నాయి."అన్ని నివేదించారు ఈ Apps ఇప్పుడు Google ప్లే నుండి తొలగించబడ్డాయి. ఈ స్పైవేర్ MobSTSPY వినియోగదారు లోకేషన్ , SMS సంభాషణలు, కాల్ లాగ్స్ మరియు క్లిప్ బోర్డు అంశాల వంటి సమాచారాన్ని దొంగిలించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ట్రెండ్ మైక్రో ఏమిచెబుతుందంటే,ఈ MobSTSPY దాని సర్వరుకు సమాచారాన్ని పంపడానికి ఫైర్ బేస్ క్లౌడ్ మెసేజింగ్ను ఉపయోగిస్తుంది. ఈ హానికరమైన ఆప్ ప్రారంభించిన తర్వాత, ఈ మాల్వేర్ మొదటగా పరికరం యొక్క నెట్వర్క్ లభ్యతను తనిఖీ చేస్తుంది. "తరువాత ఇది రీడ్ చేస్తుంది మరియు దాని C & C సర్వర్ నుండి XML కాన్ఫిగర్ ఫైలును తనకు కావాల్సిన విధంగా విభజిస్తుంది. అటుతరువాత, ఈ మాల్వేర్ వినియోగదారుడు ఉపయోగించిన భాష, దాని నమోదిత దేశం, ప్యాకేజీ పేరు, డివైజ్ తయారీదారు వంటి కొన్ని డివైజ్ సమాచారాన్ని సేకరిస్తుంది, " అని ఈ సంస్థ పేర్కొంది.
సమాచారం – దొంగిలించే సామర్థ్యాలకు అదనంగా,ఈ స్పైవేర్ కూడా పిషింగ్ ఎటాక్ ద్వారా అదనపు ఆధారాలను కూడా సేకరించవచ్చు. వినియోగదారు యొక్క ఖాతా వివరాల కోసం ఈ ఫిష్ కు పేస్ బుక్ మరియు Google వంటివాటి నకిలీ పాప్-అప్లను ప్రదర్శించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఒకవేళ వినియోగదారు (అతని / ఆమె) ఆధారాలు తెలిపితే, ఈ నకిలీ పాప్-అప్ యొక్క లాగ్-ఇన్ విజయవంతం కాదని మాత్రమే పేర్కొంటుంది. ఆలోచిస్తే, ఈ మాల్వేర్ ఇప్పటికే యూజర్ యొక్క ఆధారాలను దొంగిలించి ఉండవచ్చు.
ట్రెండ్ మైక్రో తన బ్యాక్ ఎండ్ పర్యవేక్షణ మరియు లోతైన పరిశోధనలు ద్వారా దీనితో ప్రభావిత వినియోగదారుల సాధారణ పంపిణీని చూడగలిగాయి మరియు మొత్తంగా వారు 196 వేర్వేరు దేశాల నుండి అభివర్ణించబడింది. ప్రభావితమైన వినియోగదారుల యొక్క సంఖ్యను చుస్తే, ఈ జాబితాలో భారత్ టాప్ లో నిలచింది. రష్యా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇటలీ, జర్మనీ, మరియు అమెరికా సంయుక్తం రాష్ట్రాలు కూడా దీని తాకిడికి ప్రభావితమయ్యాయి. ఇటీవల, గూగుల్ 13 మాల్వేర్ అనువర్తనాలను ప్లే స్టోర్ నుండి తొలగించింది, ఇవి హాఫ్ మిలియన్ల కంటే ఎక్కువసార్లు ఇన్స్టాల్ చేయబడింది.