షావోమి కోత్తగా, రెడ్మి నోట్ 6 ప్రో ను ఇండియాలో విడుదల చేసింది, ఇది నవంబర్ 23 నుండి Flipkart నుండి అందుబాటులో ఉంటుంది . ఈ Xiaomi Redmi Note 6 Pro కూడా ముందు మరియు వెనుక కూడా డ్యూయల్ కెమెరాలలో మొత్తంగా నాలుగు కెమెరాలు కలిగిన, ఈ బ్రాండ్ యొక్క మొదటి బడ్జెట్ స్మార్ట్ఫోన్. ఇది ఒక 6.26 అంగుళాల FHD + డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది డిస్ప్లే యొక్క పైభాగంలో నోచ్ ని కలిగి ఉంటుంది. ఇంకొక వైపు, ముందుగా వచ్చిన ఈ Xiaomi Redmi Note 5 Pro ను సంస్థ "కెమెరా బీస్ట్" అని సంభోదించింది. అయితే, ఇపుడు ఈ రెండింటిని సరిపోల్చి మనం చెల్లించే డబ్బు సరిపడే మార్పులు ఈ కొత్త ఫోన్ తీసుకొచ్చిందో లేదో? చూడటానికి ఈ రెండు పరికరాల యొక్క వివరాలను పోల్చి చూద్దాం.
షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, 1080 x 2160 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.26-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మరోవైపు, షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ఒక 5.99-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది కూడా 1080 x 2160 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది. అయితే, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో యొక్క డిస్ప్లే పైన ఒక నోచ్ అందించబడింది, షావోమి రెడ్మి నోట్ 5 ప్రో మాత్రం నోచ్ కలిగి ఉండదు. అంతేకాకుండా, పెద్దగా స్క్రీన్ వలన వారి స్మార్ట్ ఫోన్లో కంటెంట్ను చూడడానికి ఎక్కువగా సమయాన్ని గడిపినవారికి ఇది మంచిది.
దీని ప్రాసెసర్ విషయానికి వస్తే, షావోమి రెడ్మి నోట్ 6 మరియు షావోమి రెడ్మి నోట్ 5 ప్రో రెండూకూడా ఒకేవిధమైన ప్రాసెసెరుతో వస్తాయి . ఈ రెండు పరికరాలు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతచేయబడ్డాయి.
ఇక కెమేరా విభాగానికి వస్తే, రెడ్మి నోట్ 6 లో షావోమి చేసిన గమనించదగ్గ మార్పులలో ఒకటిగా దీని యొక్క కెమెరాలను గురించి చెప్పుకోవచ్చు. షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, ముందుభగంలో డ్యూయల్ 20MP + 2MP యూనిట్తో పాటు డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరాతో వస్తుంది. మరొక వైపు, షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ముందు 20MP యూనిట్ తో డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరా కలిగి ఉంది.
షావోమి రెడ్మి నోట్ 5 ప్రో రూ .14,999 ధర వద్ద ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో రూ .12,999 నుండి ప్రారంభమవుతుంది.