Smartphone Battery Tips: ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ లు కూడా నాన్ రిమూవల్ బ్యాటరీతో వస్తున్నాయి. అంటే, ఫోన్ బ్యాటరీ కనుక త్వరగా పాడయిందంటే, కొత్త బ్యాటరీ రీప్లేస్ మెంట్ కోసం స్టోర్ లేదా సర్వీస్ సెంటర్ లను ఆశ్రయించ వలసి వస్తుంది. అయితే, ఫోన్ బ్యాటరీ మేనేజ్మెంట్ తో ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా జాగ్రత్తలు తీసుకుకోవచ్చు. అంతేకాదు, ఇదే టిప్స్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ కూడా ఎక్కువ సమయం కొనసాగేలా కూడా చూసుకోవచ్చు. అందుకే, మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నడానికి బెస్ట్ టిప్స్ ఈరోజు అందిస్తున్నాము.
స్మార్ట్ ఫోన్ ఎక్కువగా బ్యాటరీని హరించేది మరియు బ్యాటరీ లైఫ్ టైమ్ ను తగ్గించే వాటిలో ముఖ్యమైన సమస్య ఇదే. ఎందుకంటే, బ్యాగ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతుంటే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుంది మరియు మాటిమాటికి ఛార్జ్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. అందుకే, బ్యాగ్రౌండ్ యాప్స్ ఏవైనా రాం అవుతుంటే వాటిని క్లోజ్ చెయ్యాలి.
ఇక మంచి బ్యాటరీ వినియోగ విషయానికి వస్తే, ఇతర యాప్స్ పోలిస్తే కొన్ని యాప్స్ మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. అంటే, బ్యాటరీని ఎక్కువ వినియోగించకుండానే పనిచేస్తాయి. అందుకే, లైట్ వెయిట్ లేదా ఆప్టిమైజ్డ్ యాప్స్ అందుబాటులో ఉంటే, వాటిని ఉపయోంచడం ఉత్తమం.
మీరు మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ ని మరియు OS లను ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యాలి. ఇళ్ల చేయడం ద్వారా కొత్త వెర్షన్ తో కొత్త ఫీచర్స్ ను ఫోను పనిచేసే తీరును మరింత మెరుగు పరచవచ్చు. తద్వారా, ఈ ఫోన్ వేగంగా పని చేస్తుంది మరియు తక్కువగా బ్యాటరీని వినియోగించుకుంటుంది.
Also Read: జబర్దస్త్ ఆఫర్: 43 ఇంచ్ LED రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
మీ ఫోన్ లో మీకు అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, మీకు అవసరమైన సమయంలో మాత్రమే ఆ ఫీచర్ ను ఉపయోగించాలి. అలాగే, మీకు అవసరం లేని సమయంలో ఆ ఫీచర్ ను డిసేబుల్ చెయ్యాలి. అంటే, బ్లూటూత్, Wi-Fi, GPS మరియు షేర్ ఫీచర్ లు అవసమైన సమయంలో మాత్రమే ఎనేబుల్ చేసుకోవాలి.
మీ ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ ను తగ్గించడం ద్వారా మీ బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. దీనికోసం, ఆటో బ్రైట్నెస్ లేదా ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నప్పుడు మాన్యువల్ గా బ్రైట్నెస్ సర్దుబాటు సెట్టింగ్ లను ఉపయోగించండి.
చాలా స్మార్ట్ ఫోన్స్ కూడా బ్యాటరీ సేవర్ మోడ్ తో వస్తాయి. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లో బ్యాగ్రౌండ్ యాప్స్ ను నిలిపియేడం మరియు పెర్ఫార్మెన్క్ ను తగ్గించడం వంటివి చేయవచ్చు. అంటే, అల్టిమేట్ గా బ్యాటరీని ఎక్కువ సమయం పని చేసేలా చేయవచ్చు మరియు బ్యాటరీ లైఫ్ ను కూడా పెంచువచ్చు.
ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ ఫోన్ లో బ్యాటరీని మాత్రమే కాదు ఫోన్ లైఫ్ టైమ్ ను కూడా పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.