స్మార్ట్ వాచ్ రిస్ట్ బెల్ట్ లో స్మార్ట్ కెమేరా : LG పేటెంట్ రిక్వెస్ట్
LG కంపెనీ, స్మార్ట్ వాచిలో కెమెరాను ఉంచడానికి, ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది.
LG కంపెనీ, స్మార్ట్ వాచిలో కెమెరాను ఉంచడానికి, ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది. డచ్ వెబ్సైట్, nl.letsgodigital.org ఒక పేటెంట్ విషయాన్ని సంపాదించింది, ఈ ఘనతను ఎలా సాధించవచ్చనేది మాత్రమే కాకుండా, దాని యొక్క పలు అప్లికేషన్లను కూడా ఇది చూపిస్తోంది. నిజానికి, ఇది సరికొత్త భావన కాదు.
ఎందుకంటే, మీరు చాలా తక్కువ ధరలో ఇటువంటి ఎంపికలలో ఒకటి ఎంచుకోవచ్చు. అయితే 'smartwatches' ఫీచర్ అందించే బ్రాండ్ వాచీగా ఇది ముందంజలో ఉంటుంది. అలాగే, ఇప్పటివరకు ఎటువంటి ప్రధాన తయారీదారులు కూడా వారి wearables లో ఈ ఫీచర్ అందించలేదు. దీనికి చాలా మంచి కారణం ఉంది. అటువంటి పరికరంలో కెమెరాతో చిత్రాన్ని తీసుకొవడం, నిజానికి చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైనది. అయితే, LG ఈ చిన్న సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
పేటెంట్ చిత్రాలను గమనిస్తే, LG పరికరంలో కెమెరాను వేర్వేరు మార్గాలు మరియు సాంకేతికతల గురించి ఆలోచిస్తున్నట్లు సూచిస్తుంది. ఈ వేరబుల్, బహుశా మెటల్ పట్టీ యొక్క ఒక పట్టీలో ఒకదానిపై కెమెరాను ఉంచడానికి ఇది ఒక మార్గం సూచిస్తుంది. ఇంకొక టెక్నిక్ ఏంచెబుతుందంటే, పట్టీలో కెమేరాని అంటిపెట్టుకుంటుంది, కానీ మొత్తం పట్టీని తిప్పి వేయడానికి అనుమతిస్తుంది, దాని ద్వారా కెమెరాను ఎక్కడవుంచుకోవాలనే విషయంలో, వినియోగదారునికి మరింత స్వేచ్ఛను ఇస్తుంది. పట్టీకి జోడించిన క్లిప్పులో కెమెరాతో ఉన్నఒక వ్యవస్థ కూడా ఉంది.
పేటెంట్ కూడా కెమెరా కోసం కొన్ని వినియోగ సందర్భాలను వివరిస్తుంది. వినియోగదారుకు ఫుడ్ చిత్రాన్నితీసుకొని, ఆ వంటకంలో ఎన్ని క్యాలరీలు ఉంటుందనే కౌంటును చూడడానికి ఈ ఎంపికను కలిగి ఉంటుంది. ఇంకా, బార్ కోడ్లను మరియు QR కోడ్లను స్కాన్ చేయడానికి ఈ కెమెరాను ఉపయోగించవచ్చు.
వాస్తవానికి, LG పేటెంట్ కోసం దరఖాస్తు మాత్రమే చేసింది, కానీ కంపెనీ ఈ లక్షణాలతో ఒక పరికరాన్ని లాంచ్ చేస్తుందని నిర్ధారణ మాత్రం మనం రాకూడదు. కాబట్టి, అసలు ఇటువంటి ప్రోడక్ట్ యొక్క దోషాలను ఇంటర్నెట్ పై ప్రారంభించకపోతే, LG సమీప భవిష్యత్తులో ఇటువంటి పరికరం ప్రదర్శించబోతుందనే విషయమే మనకు తెలియదు కదా.