మీ Aadhaar History ఇప్పటి వరకూ చెక్ చేసుకోకపోతే.. ఇలా చెక్ చేసుకోండి.!
దేశంలో ప్రథమ ఐడెంటిఫికేషన్ పత్రంగా ఆధార్ ను చూస్తున్నారు
ఆధార్ కి సంబంధించిన వివరాలను అప్డేట్ గా ఉంచుకోవాలి
ఆధార్ కార్డు ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో తెలుసుకోవడం కూడా చాలా మంచిది
Aadhaar History: దేశంలో ప్రథమ ఐడెంటిఫికేషన్ పత్రంగా ఆధార్ ను చూస్తున్నారు. అందుకే, ఆధార్ కి సంబంధించిన వివరాలను అప్డేట్ గా ఉంచుకోవాలి. అంతేకాదు, ఆధార్ కార్డు ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అలా చెక్ చేసుకోవడానికి యూజర్లకు తగిన అవకాశం కూడా UIDAI అందించింది. దీనికోసం ఆధార్ నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది.
Aadhaar History అంటే ఏమిటి?
ఆధార్ అథెంటికేషన్ లాగ్స్ మరియు యూజర్ చేసిన ఆధార్ అథెంటికేషన్ చిట్టాని ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ గా చెబుతారు. ఇది గడిచిన 6 నెలలు లేదా 50 రికార్డ్స్ వరకూ యూజర్ కు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, యూజర్లకు ఈ హిస్టరీని వెరిఫై చేసుకునే అవకాశం కూడా UIDAI అందించింది.
ఈ ఆధార్ హిస్టరీ ని ఎక్కడ చెక్ చేసుకోవచ్చు?
UIDAI అధికారిక వెబ్సైట్ resident.uidai.gov.in/aadhaar-auth-history నుండి ఈ ఆధార్ హిస్టరీ ని ప్రతి యూజర్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం కూడా ఉండదు. అంతేకాదు, mAadhaar App ద్వారా కూడా చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ హిస్టరీ ని ఎలా చెక్ చేసుకోవాలి?
ఆధార్ హిస్టరీ ని చెక్ చేసుకోవడానికి resident.uidai.gov.in/aadhaar-auth-history సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. ఈ పేజ్ లో లాగిన్ పైన క్లిక్ చేసి, అడిగిన వద్ద ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా ని ఎంటర్ చేసి OTP కోసం రిక్వెస్ట్ చెయ్యాలి. యూజర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP అందించబడుతుంది. మొబైల్ నెంబర్ పై అందుకున్న OPT నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత అథెంటికేషన్ హిస్టరీ ట్యాబ్ పైన నొక్కండి. ఇప్పుడు మీకు ఆధార్ హిస్టరీ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మోడలిటీ మరియు డేట్స్ ఎంచుకుని పక్కనే ఉన్న అథెంటికేషన్ హిస్టరీ పైన నొక్కితే మీ వివరాలు అందించబడతాయి.
Also Read: Flipkart Sale చివరి రోజు బ్రాండెడ్ TWS Buds పైన ధమాకా ఆఫర్లు అందుకోండి.!
ఏ వివరాలు తెలుసుకోవచ్చు?
ఆధార్ కార్డు హిస్టరీ లో బయోమెట్రిక్, బయోమెట్రిక్ & OTP, డెమోగ్రాఫిక్, డెమోగ్రాఫిక్ & బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ & OTP మరియు OTP లను ఎప్పుడు ఎప్పుడు చేశారు అని తెలుసుకోవచ్చు.
మీ ఆధార్ వివరాలు అప్డేట్ గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మీ ఆధార్ హిస్టరీ ని చెక్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. UIDAI అందించిన ఈ ఫీచర్ ద్వారా మీ ఆధార్ సెక్యూర్ గా ఉందని మీరు నిర్ధారించుకోవచ్చు.