Gold Rate Alert: భారీగా పడిపోయిన బంగారం ధర.!

Gold Rate Alert: భారీగా పడిపోయిన బంగారం ధర.!
HIGHLIGHTS

ఈరోజు గోల్డ్ మార్కెట్ భారీ పతనాన్ని చూసింది

బంగారం ధర రోజు రోజుకూ క్రిందకు దిగడం మొదలుపెట్టింది

ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ రేట్ 14 నెలల కనిష్ఠం వద్ద కొనసాగుతోంది

Gold Rate Alert: ఈరోజు గోల్డ్ మార్కెట్ భారీ పతనాన్ని చూసింది. నవంబర్ నెల మొదలవుతూనే బంగారం ధర రోజు రోజుకూ క్రిందకు దిగడం మొదలుపెట్టింది. ఈ నెల ప్రారంభం నుండి గోల్డ్ మార్కెట్ సూచీలను పరిశీలిస్తే దాదాపుగా 1,000 రూపాయలకు పైగా తులం స్వచ్ఛమైన బంగారం రేటు పడిపోయింది. ఇక ఈరోజు విషయానికి వస్తే, కేవలం ఈ ఒక్కరోజే తులం బంగారం ధర 600 కు పైగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ రేట్ 14 నెలల కనిష్ఠం వద్ద కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎంత ఉన్నదో పరిశీలిద్దాం.

Gold Rate Alert:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,700 రూపాయలుగా ఉండగా, ఈరోజు 600 రూపాయ క్రిందకు దిగి రూ.46,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,290 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,290 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,110 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,290 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,440 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,060 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,340 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo