Cyber Scam: ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. స్కామ్ లకు ఎవరూ కాదు అనర్హం అనే విధంగా బ్యాంక్ ఆఫీసర్ మొదలుకొని టెక్కిని సైతం మోసగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జరిగిన సైబర్ స్కామ్ ప్రజలను మరింత ఆలోచింప చేసే విధంగా వుంది. ఈసారి బ్యాంక్ ఆఫీసర్ ముసుగులో పూణే టెక్కీ నుంచి స్కామర్లు 13 లక్షలు నొక్కేశారు. దీనికోసం, రిమోట్ యాక్సెస్ ను ఉపయోగించారు.
పూణే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో పని చేస్తున్న 57 సంవత్సరాల టెక్నికల్ ఆఫీసర్ ను మోసగించి 13 లక్షలకు స్కామర్లు కుచ్చు టోపీ పెట్టారు. స్కామర్లు వాట్సాప్ లో సదరు పూణే టెక్కి కి తమను తాము ఒక ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఆఫీసర్ గా పరిచయం చేసుకున్నారు స్కామర్లు. పరిచయం చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ KYC వివరాలు అప్డేట్ చేయాలి ఆన్లైన్లో ఎలా చేయాలో మేము తెలియజేస్తామని నమ్మబలికారు. ఒకవేళ అప్డేట్ చేసుకో నట్లయితే మీ అకౌంట్ ఫ్రిజ్ అవుతుందంటూ నమ్మించారు.
స్కామర్లు చెబుతున్న విషయం పూర్తిగా అఫీషియల్ అని అనిపించేలా ఒక మెసేజ్ ను మరియు దానికి అటాచ్ చేసిన డౌన్లోడ్ లింక్ ని కూడా పంపించారు. ఇది నిజంగానే బ్యాంక్ అకౌంట్ అఫీషియల్ నుంచి వచ్చిన మెసేజ్ గా భావించిన సదరు టెక్ని, ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాస్తవానికి, ఆ టెక్కీ డౌన్లోడ్ చేసుకుంది రిమోట్ యాక్సెస్ అప్లికేషన్ మరియు ఇది మొబైల్ యొక్క పూర్తి యాక్సెస్ ఆ స్కామర్స్ కి అందించింది.
అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్న తర్వాత OTP లు అందుకోవడం మొదలయ్యింది. అయితే, తాను ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడం లేదు అని ఆ టెక్కీ ఆ OTP లను అనగా పట్టించుకోలేదు. అయితే, వేంటనే అకౌంట్ నుంచి 12.95 లక్షలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. సదరు టెక్కీకి అప్పుడు అర్ధం అయ్యింది తాను మోసపోయిన విషయం. వెంటనే ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
Also Read: Flipkart Sale నుంచి రూ. 8,999 కే 2.1.2 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్, వాట్సాప్ చాట్ లేదా SMS లకు స్పందించకండి. ముఖ్యంగా KYC అప్డేట్ కోసం వచ్చే కాల్స్ ని అస్సలు నమ్మకూడదు.
ఏదైనా లింక్స్ మీకు వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వాటి పై నొక్కకూడదు.
ముఖ్యంగా, మీకు వచ్చిన కాల్ లేదా SMS వంటి వాటిపై ఏ మాత్రం మీకు అనుమానం కలిగినా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి.