SBI బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక వాట్సాప్ లో బ్యాంకు పనులు.!!

SBI బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక వాట్సాప్ లో బ్యాంకు పనులు.!!
HIGHLIGHTS

SBI బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది

SBI చిటికెలో పనులు చక్కబెట్టేలా కొత్త సర్వీస్ ప్రారంభించింది

కస్టమర్లు బ్యాంక్ కు వెళ్లకుండానే వాట్సాప్ లో చిటికెలో పనులు చక్కబెట్టవచ్చు

SBI బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. కస్టమర్లు చీటికీ మాటికీ బ్యాంక్ దారిపట్టకుండా చిటికెలో పనులు చక్కబెట్టేలా కొత్త సర్వీస్ ప్రారంభించింది. వాట్సాప్ వేదికగా మల్టీ సర్వీస్ లు అందుబాటులోకి రానున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ముఖ్యంగా, బ్యాంక్ అకౌంట్ లో బాలన్స్ అమౌంట్ చెకింగ్ లేదా మినీ స్టేట్మెంట్ వంటి పనులకు కస్టమర్లు బ్యాంక్ కు వెళ్లకుండానే వాట్సాప్ లో చిటికెలో పొందవచ్చు.

ఈ సర్వీస్ లను మీరు పొందాలంటే, మీరు ముందుగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మరి ఆ స్టెప్స్ ఏమిటో మరియు మీరు మీ వాట్సాప్ లో మీ SBI బ్యాంక్ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చునో తెలుసుకుందామా.

వాట్సాప్ లో SBI బ్యాంక్ సర్వీస్ కోసం ఇలా చేయండి

వాట్సాప్ లో SBI బ్యాంక్ సర్వీస్ పొందాలంటే, ముందుగా నంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం, WAREG అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చిన తరువాత మీ అకౌంట్ నంబర్ ను కూడా టైప్ చేసి 7208933148 నంబర్ కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మెసేజ్ చేయాలి. ఇలా మీ నంబర్ ను రిజిస్టర్ చేసుకున్న తరువాత, మీకు తిరిగి మీ నంబర్ పైన వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అంటే, మీరు తిరిగి రిప్లై ఇవ్వడం ద్వారా మీ కావాల్సిన సర్వీస్ లను పొందవచ్చు.

మీకు SBI బైనాక్ యొక్క వాట్సాప్ నంబర్ 90226 90226 నుండి వాట్సాప్ మెసేజిలు మరియు సర్వీస్ లు అందుతాయి. మొదటి మీరు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా సేవలను కోనసాగించవచ్చు. ప్రస్తుతం, ఈ వాట్సాప్ సర్వీస్ నుండి 'Balance Enquiry' మరియు 'Mini Statement' సర్వీస్ లు మాత్రమే అంధుబౌట్లో వున్నాయి. అయితే, త్వరలోనే మరిన్ని సర్వీస్ లను ఇందులో జత చేయనునట్లుగా SBI తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo