Samsung Galaxy Tab S3 భారత్ లో లాంచ్ చేయబడింది . భారత్ లో దీని ధర Rs. 47,990 ఇప్పుడు ఈ ట్యాబ్ అమెజాన్ లో సేల్స్ కి అందుబాటులో కలదు .
దీనితో పాటుగా కంపెనీ ఒక బుక్ కవర్ ను కూడా ప్రవేశపెట్టింది దీని ధర Rs. 2,999 అలానే ఒక పోగొ కీ బోర్డు కవర్ కూడా కంపెనీ ప్రవేశపెట్టింది . దీని ధర Rs. 8,499 .
Samsung Galaxy Tab S3 లో ఫీచర్స్ ని చూస్తే 9.7-ఇంచెస్ QXGA సూపర్ AMOLED డిస్ప్లే అండ్ రెసొల్యూషన్ 2048×1536 మరియు ఈ ట్యాబ్ లో నాలుగు స్టీరియో స్పీకర్స్ కూడా కలవు . దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రోసెసర్ తో పాటుగా 4GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . దీనిని మైక్రో SD ద్వారా 256GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .
దీనిలో కెమెరా చూస్తే 13MP ఎంపీ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా . మరియు ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . మరియు దీనిలో 6,000mAh బ్యాటరీ అండ్ 4G LTE, వైఫై బ్లూటూత్ 4.2, USB టైప్ -C మరియు GPS వంటి ఫీచర్స్ కలవు .