50MP సెల్ఫీ క్యామ్ తో వచ్చిన Samsung Galaxy M55 5G టాప్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!
Samsung Galaxy M55 5G విడుదల చేసిన సాంసంగ్
సాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 30 వేల ఉప బడ్జెట్ కేటగిరిలో విడుదల చేసింది
ఈ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు రేటు వివరాలు తెలుసుకోండి
ముందుగా బ్రెజిల్ మార్కెట్ లో Samsung Galaxy M55 5G విడుదల చేసిన సాంసంగ్ ఈ ఫోన్ ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదల చేసింది. బ్రెజిల్ మార్కెట్ తో పోలిస్తే, ఇండియన్ మార్కెట్ లో తక్కువ ధరలోనే లాంఛ్ చేసినట్లు చెప్పవచ్చు. సాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 30 వేల ఉప బడ్జెట్ కేటగిరిలో విడుదల చేసింది. సాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు రేటు వివరాలు తెలుసుకోండి.
Samsung Galaxy M55 5G: Price
సాంసంగ్ గెలాక్సీ ఎం55 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 26,999 స్టార్టింగ్ ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128 GB వేరియంట్ ను కోసం ఈ ధరను నిర్ణయించింది. ఈ ఫోన్ రెండవ 8GB + 256 GB వేరియంట్ ను రూ. 29,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ ను 12GB + 256 GB వేరియంట్ ను రూ. 32,999 ధరతో విడుదల చేసింది.
ఈ ఫోన్ ఈరోజు నుండి అమేజాన్ మరియు సాంసంగ్ అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పైన ALL Banks Card ఆప్షన్ పైన రూ. 2,000 డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.
Samsung Galaxy M55 5G టాప్ ఫీచర్లు
DISPLAY
ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ Super AMOLED+ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.
CAMERA
ఈ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ 50MP (F1.8) మెయిన్ + 8MP (F2.2) అల్ట్రా వైడ్ + 2MP (F2.4) మ్యాక్రో లతో ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 50MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో UltraHD 4k వీడియో లను మరియు అద్భుతమైన ఫోటోలను అందిస్తుందని సాంసంగ్ తెలిపింది.
Also Read: భారీ ఆఫర్లతో Motorola Edge 50 Pro 5G ఫస్ట్ సేల్ .!
PERFORMENCE
ఈ సాంసంగ్ ఫోన్ ను Snapdragon 7 Gen 1 ప్రోసెసర్ మరియు జతగా 12GB RAM మరియు 256 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు ర్యామ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
OS UPDATES & SECURITY
ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు Android OS అప్గ్రేడ్ లు మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 OS తో వస్తుంది.
BATTERY
గెలాక్సీ ఎం55 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.