ఫెమలీ fridge, నోట్ బుక్ 9 మరియు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన శామ్సంగ్[CES 2016]

ఫెమలీ fridge, నోట్ బుక్ 9 మరియు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన శామ్సంగ్[CES 2016]

లాస్ వేగాస్ లో జరుగుతున్న CES 2016 లో శామ్సంగ్ కొన్ని ప్రొడక్ట్స్ ను రివీల్ చేసింది. IoT enabled రిఫరిజ్రేటర్స్, విండోస్ లాప్ టాప్స్, స్మార్ట్ టీవీ, 4K బ్లూ రే ప్లేయర్ వీటిలో ఉన్నాయి.

శామ్సంగ్ ఫెమలీ HUB fridge
21.5 in ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది ఇది. లోపల ఏమున్నాయి అని చూపిస్తుంది డోర్ ఓపెన్ చేయనవసరం లేకుండా. ఎలెక్ట్రికల్ బిల్లింగ్ కూడా ఇది సేవ్ చేస్తుంది. డిస్ప్లే Tizen os పై రన్ అవుతుంది. లోపల 3 కెమెరాలు ఉంటాయి capture చేయటానికి. ఆండ్రాయిడ్/ios యాప్ sync కోసం., బిల్ట్ in స్పీకర్ లో సాంగ్స్ వినవచ్చు, స్మార్ట్ టీవీ కు కనెక్ట్ చేయగలరు, మాస్టర్ కార్డ్ grocery ఆర్దరింగ్ సర్విస్ కూడా ఉంది. డిస్ప్లే లో రిమైండర్స్, youtube వీడియోస్ అండ్ కేలందర్స్ చూడగలరు.

శామ్సంగ్ నోట్ బుక్ 9 లాప్ టాప్స్ 
కొత్త నోట్ బుక్ 9 సిరిస్ తో సూపర్బ్ లుక్స్ తో వస్తున్నాయి ఇవి. రెండు వేరియంట్స్ మొత్తం. 13.3 in వేరియంట్ బరువు 0.84kg, 15 in నోట్ బుక్ 9 1.29 kg బరువు. రెండూ విండోస్ 10 పై రన్ అవుతాయి. లేటెస్ట్ ఇంటెల్ Skylake ప్రొసెసర్స్ పై పనిచేస్తాయి.

The Verge రిపోర్ట్ ప్రకారం చాలా లైట్ గా ఉన్నాయి ఇవి. అసలు వీటిలో బ్యాటరీ ఉందా లేదా అనే డౌట్ వస్తుంది. 15in వేరియంట్ 12 గంటల బ్యాక్ అప్ అండ్ 20 మినిట్స్ లో ఫుల్ చార్జ్ అయ్యే క్విక్ చార్జింగ్ ఫీచర్  ఉంది.

13.3 in వేరియంట్ లో 10 గంటల బ్యాక్ అప్ ఉంది. రెండూ ఫుల్ HD డిస్ప్లే తో రానున్నాయి. pattern లాగ్ in, సిక్రిట్ స్క్రీన్, రికార్డ్ బ్లాక్ ఫీచర్స్ తో ఫైల్స్ ను ప్రొటెక్ట్ చేయగలరు.

శామ్సంగ్ లింక్ 2.0 అండ్ సైడ్ sync 4.0 సర్వీసెస్ ద్వారా users కు కంటెంట్ షేర్ చేస్తుంది. 128 అండ్ 256 gb స్టోరేజ్ ఆప్షన్స్, 4gb అండ్ 8gb ర్యామ్, usb c పోర్ట్(15in లోనే) తో సిల్వర్, మోడర్న్ పింక్ కలర్స్ లో మార్కెట్ లోకి రానున్నాయి.

శామ్సంగ్ SUHD టీవీలు
Tizen ప్లాట్ ఫార్మ్ పై రన్ అయ్యే  curved స్క్రీన్ స్మార్ట్ టీవీ లను unveil చేసింది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, SUHD ఇంప్రూవ్డ్ కేపబిలిటీస్, added ఫీచర్స్ తో వస్తున్నాయి.

బ్రైటర్ అండ్ vivid ఇమేజ్ కొరకు HDR సపోర్ట్ తో వస్తుంది. అలాగే స్మార్ట్ రిమోట్ ఆతోమేటిక్ గా మీరు వాడే కేబుల్ నెట్ వర్క్ డిష్ ఏదైనా సరే, ఆ సెట్ అప్ బాక్స్ కు కూడా రిమోట్ పనిచేస్తుంది, వేరే సెట్ అప్ బాక్స్ రిమోట్ అవసరం లేదు.

200 స్మార్ట్ థింగ్స్ తో వచ్చే డివైజెస్ కు కనెక్ట్ అవగలదు టీవీ. అంటే మీ ఇంటి డోర్ బెల్ ఎవరు రింగ్ చేస్తున్నారు, లైట్స్ ఎవరు ఆఫ్ చేస్తున్నారు వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT టెక్నాలజీ వాడుకోగలరు. అంటే IoT కంట్రోలర్స్ గా వాడుకోవచ్చు.

గేమింగ్ కొరకు consoles అవసరం లేకుండా ఆడగలరు. ఎక్స్ట్రా హాట్ బటన్ – ఇది స్క్రీన్ పై ఉండే కంటెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ టాబ్ ప్రో S – 2 in 1 టాబ్లెట్ with విండోస్ 
ఇది 12 in అమోలేడ్ డిస్ప్లే తో వస్తున్న హైబ్రిడ్ డివైజ్. హైబ్రిడ్ అంటే టాబ్లెట్ లేదా మొబైల్ అండ్ pc వలె వాడుకోగలిగేది. విండోస్ 10 os పై రన్ అవుతుంది. ఫుల్ సైజ్ కీ బోర్డ్ కవర్, LTE cat 6, 10.5 గంటల బ్యాక్ అప్, ఇంటెల్ కోర్ M ప్రొసెసర్, fanless హార్డ్ వేర్, మల్టీ పోర్ట్ adapter (HDMI, USB టైప్ A అండ్ C పోర్ట్స్), బ్లూటూత్ పెన్ (సెపరేట్ డివైజ్)

ఈ మేజర్ అనౌన్స్మెంట్స్ మాత్రమే కాకుండా Gear S2 క్లాసిక్ with గోల్డ్ అండ్ ప్లాటినం – రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యాయి. అండ్ బ్లూ రే ప్లేయర్ with అల్ట్రా HD, పోర్టబుల్ SSD T3 palm సైజ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, హాండ్ మోషన్ కంట్రోల్ ఫర్ మొబైల్ VR డివైజెస్ మరియు TipTalk – యూసర్ ఎక్స్పీరియన్స్ (UX) డివైజ్. ఇది బాడి లో వచ్చే సౌండ్స్ ను వినిపిస్తుంది.

2016 లో CES ఈవెంట్ లో సామ్సంగ్ ఇవే unveil చేసింది టోటల్ గా.

Adamya Sharma

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo