నార్త్ ఇండియాలోని ఒక వ్యక్తి సామ్సంగ్ గెలాక్సీ J5 స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేయగా, ఇంటికి వచ్చిన ఫోన్ ఓపెన్ చేసి చూస్తె బాక్స్ లో ఫోన్ కు బదులు బట్టలు ఉతికే డిటర్జెంట్ సబ్బు ఉంది.
ఆర్డర్ చేసిన వ్యక్తి ఈ విషయాన్ని ట్విటర్ లో పెట్టడం జరిగింది. ఇది అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో బుక్ చేసినట్లు గా తెలుస్తుంది అతని tweet చూస్తుంటే.
దీనికి అమెజాన్ కస్టమర్ కేర్ కూడా స్పందించింది. ఇలాంటి అనుభవం ఎదురైనందుకు క్షమాపణలు చెబుతూ కస్టమర్ కేర్ సపోర్ట్ కు ఫిర్యాదు చేయమని అడిగింది అమెజాన్. క్రింద అతని tweet చూడగలరు.