Elon vs Altman: Open AI కోసం ఎలాన్ మస్క్ భారీ మొత్తం ఆఫర్..ఒక రేంజ్ లో ఆల్ట్‌మాన్ రిప్లై.!

Elon vs Altman: Open AI కోసం ఎలాన్ మస్క్ భారీ మొత్తం ఆఫర్..ఒక రేంజ్ లో ఆల్ట్‌మాన్ రిప్లై.!
HIGHLIGHTS

సంచలన స్టేట్మెంట్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారిన ఎలన్ మస్క్

Open AI కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు నివేదిక

ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చిన ఓపెన్ ఎఐ CEO సామ్ ఆల్ట్‌మాన్

Elon vs Altman: అపర కుబేరుడు ఎలన్ మస్క్ ప్రతి రోజు ఏదో ఒక కొత్త స్టేట్మెంట్ తో వార్తల్లో నిలుస్తారు. Open AI కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడమే కాకుండా ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు ఓపెన్ ఎఐ CEO సామ్ ఆల్ట్‌మాన్.

Elon vs Altman:

ట్విట్టర్ ను కొనుగోలు చేసి దాని పేరును X మార్చిన మస్క్, ఇప్పుడు మరొక కంపెనీ పై కన్నేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ Open AI కు ముందుగా సహ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్న మస్క్ దాని నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పూర్తి స్థాయిలో Open AI ని కంట్రోల్ లోకి తీసుకునే విధంగా ఈ సంస్థ కోసం ఏకంగా 97.4 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, ఈ బిగ్ ఆఫర్ ను ఏ మాత్రం పట్టించుకోని సామ్ ఆల్ట్‌మాన్ సున్నితంగా తిరస్కరించారు.

సామ్ ఆల్ట్‌మాన్ కేవలం ఎలన్ మస్క్ ఆఫర్ ను తిరస్కరించడమే కాదు, ట్విట్టర్ (ప్రసుతం X) ను అమ్మితే 9.74 బిలియన్ కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ విషయాని సామ్ ఆల్ట్‌మాన్ తన X అకౌంట్ ను నుంచి షేర్ చేశారు. ఈ విషయం ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Airtel Budget Plan: అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ సంవత్సరం మొత్తం అందించే బెస్ట్ ప్లాన్.!

ఇదంతా ఇలా ఉంటే X లో మాత్రం నెటిజన్లు ఎవరికి నచ్చింది వారు చెబుతున్నారు. సామ్ ఇప్పుడు కూడా ట్విట్టర్ అనే పిలుస్తున్నారు, ఇది ఇప్పుడు X గా మారిందని కొందరు హేళన చేస్తుంటే, కొందరు మాత్రం ప్రపంచంలో పవర్ ఫుల్ శక్తిగా మారిన మస్క్ తో ఢీకొట్టారు, కొంచెం జాగ్రత్త అని మరి కొందరు హితవు పలుకుతున్నారు. అయితే, ఈ విషయం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo