ఈరోజు నుండి మొదలైన రూ.2,000 నోట్స్ ఎక్స్ చేంజ్..ఈ విషయం తెలుసుకోండి.!
RBI ప్రకటించిన కొత్త రూల్ ఈరోజు నుండి అమలులోకి వచ్చింది
ఈరోజు నుండి రూ.2,000 నోట్స్ ను డిపాజిట్ చేసుకోవలసి ఉంటుంది
ఒక్కసారి కేవలం 10 నోట్లను మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది
RBI ప్రకటించిన కొత్త రూల్ ఈరోజు నుండి అమలులోకి వచ్చింది. అదేనండి, రూ.2,000 రూపాయల నోట్లను తిరిగి వెనక్కు తీసుకోనున్నట్లు, విదిగా ప్రతి ఒక్కరు కూడా వారి వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయవలిసిందిగా RBI ప్రకటించిన విషయం గురించే ఇప్పడు చెబుతోంది. RBI ప్రకారం, ఈరోజు నుండి రూ.2,000 నోట్స్ ను డిపాజిట్ చేసుకోవలసి ఉంటుంది. అయితే, డిపాజిస్ట్ మరియు ఎక్స్ ఛేంజ్ కి సంబంచించిన కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది.
రూ.2,000 నోట్స్ డిపాజిట్ విషయంలో పాన్ నెంబర్ సబ్ మీట్ చెయ్యాలా లేక అవసరం లేదా అని చాలా మందికి డౌట్ వుంది. అయితే, దీని కోసం కొత్త రూల్ ఏమి లేదని ముందు నుండే అమలులో వున్నా రూల్, రూ. 50,000 మరియు అంత కంటే ఎక్కువ మొత్తం అమౌంట్ డిపాజిట్ కోసం పాన్ నెంబర్ ను విధిగా ఇవ్వవలసి ఉంటుంది, దీని ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు, ఒక్కరోజులో ఎన్ని సార్లైనా రూ.2,000 ను డిపాజిట్ చేసుకోవచ్చని కూడా నిన్న జరిగిన మీటింగ్ ద్వారా RBI గవర్నర్, శక్తికాంతా దాస్ తెలిపారు. అంటే, ఇట్టి కంటే ఎక్కువ సార్లు కూడా రూ.2,000 ని డిపాజిట్ చేసుకునే వీలుంది. అయితే, రూ.2,000 నోట్ లను మార్పిడి చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఒక్కసారి కేవలం 10 నోట్లను మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ డిపాజిట్ విషయంలో ఇది వర్తించదని గుర్తుచుకోండి.