అంతరిక్ష లోతుల నుండి పునరావృతంగా రేడియో సిగ్నల్స్ వస్తున్నట్లు తెలిపిన ఖగోళశాస్త్రవేత్తలు

Updated on 10-Jan-2019
HIGHLIGHTS

ఒక శాస్త్రవేత్తల బృందం, అంతరిక్ష లోతుల నుండి ఫాస్ట్ రేడియో బర్స్ట్ (FRBs)ని పికప్ చేసారు. ఎలియన్లు మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయతిస్తున్నారంటే మీరు నమ్ముతారా?

ముఖ్యాంశాలు:

1. ఒక శాస్త్రవేత్తల బృందం, అంతరిక్ష లోతుల నుండి ఫాస్ట్ రేడియో బర్స్ట్ (FRBs)ని పికప్ చేసారు. 

2. శాస్త్రవేత్తలు వారు మూడు వారాల విండోలో 13 FRB లను తీసుకున్నారు.

3. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్ CHIME / FRB ఇన్స్ట్రుమెంట్ ద్వారా తీసుకోబడ్డాయి.

నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నుంచి ఒక శాస్త్రవేత్తల బృందం వారు అంతరిక్ష లోతుల నుండి పునరావృతంగా ఫాస్ట్ రేడియో బర్స్ట్ (FRBs)ని పికప్ చేసినట్లు తెలిపారు. మరింత ప్రత్యేకంగా, కెనడియన్ హైడ్రోజెన్ ఇంటెన్సిటీ మాపింగ్ ఎక్స్పరిమెంట్ (CHIME) ను ఏర్పాటు చేసే ప్రక్రియలో CHIME / FRB  ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి, 400Mhz తక్కువ రేడియో పౌనఃపున్యంలో పదమూడు ఫాస్ట్ రేడియో బర్స్ట్ (FRBs) గుర్తించినట్లు, ఈ బృందం పేర్కొంది. ఈ విషయం పైన వారి అన్వేషణలు మరియు అనుభవాల గురించి ఈ బృందం, ఒక ఆన్ లైన్ పేపర్ అయితనువంటి నేచర్ లో తెలియజేసింది.

ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్, అత్యంత విచ్చిన్నమైన రేడియో ఫ్లాష్ లు మన పాలపుంత వెలుపల నుండి త్వరగా రావడం గమనించారు. శాస్త్రవేత్తల ప్రకారం, పదమూడు ఫాస్ట్ రేడియో బర్స్ట్ లో ఒకదానిలో ఇప్పటివరకు నివేదించిన అత్యల్ప విక్షేపణ కొలమానంగా చెప్పవచ్చు, అనగా ఇప్పటివారికి అందుకున్నవాటిలో  చాల దగ్గరిగా అందుకుంది. ఈ బర్స్ట్, కేవలం ఒక మిల్లీసెకను పరిధితో వున్నాయి , సూర్యుడు ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేయగల శక్తితో సమానమైన శక్తితో ఇవి బదిలీ చేయబడుతుంది. ఈ అంశంపై ఇటీవలి MSN నివేదిక ప్రకారం, నక్షత్రాల పేలుడు నుండి గ్రహాంతర సంభాషణ వరకు ఈ బర్స్ట్  గురించి ప్రతిదీ వాటి ఫలితాల పైన ఊహించబడ్డాయి.

"ఇప్పటి వరకు, ఒకటి మాత్రమే రిపీటింగ్ FRB. ఇంకా మరొకటి అక్కడ ఉందని సూచిస్తున్నారు ఇంకా అక్కడ మరిన్ని ఉండవచ్చు అని ," ఇన్గ్రిడ్ స్టైర్స్ అన్నారు, ఈయన CHIME జట్టు సభ్యుడు మరియు బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం వద్ద ఒక ఖగోళ శాస్త్రవేత్త. "మరియు మరిన్ని రిపీటర్లు మరియు అధ్యయనానికి అందుబాటులో ఉన్న మరిన్ని వనరులతో, వారు ఎక్కడ నుండి వచ్చారో మరియు వాటికి కారణమమేమిటని – మేము ఈ విశ్వ ప్రయోగాల ద్వారా అర్ధం చేసుకోగలగాలి."

మూడు వారాల వ్యవధిలో కైవసం చేసుకున్న పదమూడు ఫాస్ట్ రేడియో బర్స్ట్ మన గ్రహం మరియు విశ్వంలో జీవం యొక్క అధ్యయనంలో విలువైన మరియు ఆసక్తికరమైన డేటాగా శాస్త్రవేత్తలకు సేవలు అందిస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ అభివృద్ధి డీప్ స్పేస్ గురించి తెలుసుకోవాలని కలలు కానేవారికి ఇది ఒక మంచి అవకాశమని భావిస్తున్నారు. ఒక Reddit వినియోగదారు, ఒకరి కోసం, ఈ ఉదయం ఈ విషయంపై చర్చ థ్రెడ్ను ప్రారంభించింది.

కవర్ ఇమేజి గౌరవం :CHIME

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :