RIL AGM 2023: ఈరోజు 46th AGM మీటింగ్ నుండి Jio 5G Phone లాంచ్ చేస్తుందా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతీ సంవత్సరం నిర్వహించే AGM ఈరోజు జరగనున్నది
ఈరోజు 46 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (46th AGM) ను రిలయన్స్ నిర్వహిస్తోంది
ఈరోజు 46th AGM నుండి Jio 5G Phone ప్రకటన చేసే అవకాశం వుంది
ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతీ సంవత్సరం నిర్వహించే యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM) ఈరోజు జరగనున్నది. ఈరోజు 46 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (46th AGM) ను రిలయన్స్ నిర్వహిస్తోంది. ఈ RIL AGM 2023 మీటింగ్ మధ్యాహ్నం 2 గంటల నుండి మొదలవుతుంది మరియు ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగానే చాలా అట్టహాసంగా నిర్వహించన్నది మరియు ఈకార్యక్రం పూర్తిగా LIVE చేయబడుతుంది. ఈరోజు జరగనున్న రిలయన్స్ మీటింగ్ ను LIVE టెలికాస్ట్ ను మీరు కూడా చూసి అందించవచ్చు. ఈ కార్యక్రమం లైవ్ ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి మరియు ఈరోజు 46th AGM నుండి ఎటువంటి ప్రకటనలు రిలయన్స్ చేసే అవకాశం వుంది, అనే వివరాలను విపులంగా చర్చిద్దాం.
RIL AGM 2023 LIVE ఎలా చూడాలి?
RIL AGM 2023 కార్యక్రమాన్ని మీరు రిలయన్స్ యొక్క అధికారిక Youtube ఛానెల్ నుండి LIVE చూడవచ్చు. అంతేకాదు, రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యొక్క అధికారిక twitter, Facebook మరియు Instagram అధికారిక అకౌంట్ నుండి కూడా అప్డేట్ లను పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ నుండి నేరుగా కూడా LIVE చూడవచ్చు. ఈ ఆర్టికల్ క్రింద LIVE కార్యక్రమం అందించబడింది.
RIL AGM 2023 LIVE లో ఎటువంటి ప్రకటనలు చేయవచ్చు?
గత కొంత కాలంగా వస్తున్నా లీక్స్ మరియు రూమర్స్ ను నమ్మినట్లయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (46th AGM) నుండి Jio 5G Mobile ను లాంచ్ చేయవచ్చని మరియు ఇది ఈ మీటింగ్ కి ప్రధాన ఆకర్షణ కావచ్చు. వాస్తవానికి, Jio 5G నెట్ వర్క్ అతివేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయడం అనేది సరైన మార్గం కావచ్చు. అయితే, ఈ 5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యం.
అయితే, ఈ మీటింగ్ నుండి Jio 5G Prepaid మరియు Post Paid ప్లాన్స్ కూడా ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తన 5G Network ను విస్తరించిన జియో ప్లాన్స్ పైన ద్రుష్టి సారించే అవకాశం లేక పోలేదు, అనేది నిపుణుల తర్కంగా కనిపిస్తోంది.
అంతేకాదు, ఈరోజు జరగనున్న RIL 46th AGM (2023) నుండి AirFiber 5G మరియు 5G Hotspot Device ను కూడా లాంచ్ చేయవచ్చని కూడా మీడియా వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. అయితే, ఇవన్ని కూడా అంచనాలు మాత్రమే ఈ మీటింగ్ ముగిసే సమయానికి కొత్త లాంచెస్ ఏమిటో తెలుస్తాయి.
ఈరోజు జరగనున్న RIL 46th AGM నుండి ఏదైనా సందేహాలను లేదా ప్రశ్నలు ఉంటే, వాటిని నేరుగా కంపెనీ ని అడిగి తెలుసుకునే ఏర్పాటును కూడా రిలయన్స్ అందించింది. ఇందుకోసం రిలయన్స్ చాట్ బోట్ ను ఏర్పాటు చేసింది. దినొకసం మీరు మీ WhatsApp నుండి +91-7977111111 నెంబర్ కు 'Hi' పంపిండం ద్వారా స్టార్ట్ చేయవచ్చు.