టెలికాం కంపెనీ రిలయన్స్ జియో డేటా బెనిఫిట్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్ లను తన వినియోగదారులకు అందిస్తుంది. ఈసారి కంపెనీ దాని 4G హాట్స్పాట్ జియోఫై తో గొప్ప ఆఫర్ ని అందింస్తుంది . జియో ప్రజలు వారి JIOFI చేరుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ రూ .1,999 యొక్క జియోఫై పై 3595 రూపీస్ బెనిఫిట్ అందిస్తుంది .
దీనిలో 336GB డేటా ఫ్రీ ఉంటుంది. కంపెనీ 1999 రూపీస్ లో Jiofi ని ప్రారంభించింది, అయితే గత ఏడాది ఇది 999 రూపాయలకు తగ్గించబడింది. మరోసారి Jiofi ని ఆఫర్లతో 1999 రూ.లో కొనుగోలు చేయవచ్చు .రిలయన్స్ జీయో సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరుకోవడానికి మరియు మిగతా కంపెనీస్ తో పోటీ పడటానికి కొత్త అవకాశాలను అందిస్తోంది. ఈ శ్రేణిలో జియో తన 4G హాట్స్పాట్ Jiofi తో బండిల్ బెనిఫిట్స్ ని ప్రవేశపెట్టింది. దీనిని 1,995 రూపాయలకు కొంటే యూజర్ కి 1,295 రూ. డేటా మరియు రూ. 2,300 ల జియో వోచర్ లభ్యం .
ఈ ఆఫర్ లో , జియో మొదటి మూడు రీఛార్జ్ ఆప్షన్స్ ను అందిస్తోంది, దీనిలో వినియోగదారులు వేర్వేరు డేటా బెనిఫిట్స్ మరియు వాలిడిటీ ప్లాన్లను పొందగలరు. 1,999 రూపాయల 4G హాట్స్పాట్ జి కొనుగోలు సమయంలో యూజర్ కి మొదటి మూడు రీఛార్జి ఆప్షన్స్ లభ్యం .
ఆప్షన్ 1 లో జియో 4 జి నెట్వర్క్ స్పీడ్ తో 1.5GB డేటాను ఇస్తుంది 8 రీఛార్జ్ సైకిల్ 8 నెలలు వాలిడ్ అవుతుంది . రెండవ ఆప్షన్ లో 6నెలలు 2GB డేటాను పొందవచ్చు. అదే సమయంలో, మూడవ ఆప్షన్ లో ప్రతిరోజూ 3 జిబి డేటాను పొందుతారు.
ఈ మూడు రీఛార్జ్ ఆప్షన్స్ లో , 336 జిబి డేటా మరియు 99 రూపాయల జియో ప్రైమ్ మెంబర్షిప్ ఉచితం. ఇవే కాకుండా, కంపెనీ 2300 రూపాయల షాపింగ్ వోచర్ అందిస్తున్నారు, వీటిలో Paytm , JIO మరియు రిలయన్స్ డిజిటల్ వంటి స్టోర్స్ ఉన్నాయి.
కస్టమర్స్ Paytm నుంచి 800 రూపాయల క్యాష్ బ్యాక్ వోచర్ ని పొందుతారు. AJio వోచర్ గురించి మాట్లాడితే అప్పుడు దీనిలో 1500 రూపాయల కొనుగోలు పై 500 రూపాయల డిస్కౌంట్ ఉంటుంది. దీనితో పాటు, రిలయన్స్ డిజిటల్ వోచర్ లో 1,000 రూపాయల ఒక వోచర్ ని ఉపయోగించవచ్చు .
ఈ అన్ని కూపన్లను జియో యాప్ పై కస్టమర్స్ జియో ఫై అకౌంట్ లో చూడవచ్చు. రూ .1,295 డేటా మరియు 2,300 రూపాయల జియో వోచర్ కోసం, వినియోగదారులు కేవలం రూ .1,999 ల జియోఫై ని కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్లు అన్ని రిలయన్స్ రిటైల్ దుకాణాల్లో మరియు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన Jio.com లో అందుబాటులో వున్నాయి .
గత ఏడాది జియోఫై 4 జి హాట్ స్పాట్ ధర 1,999 రూపాయల నుండి 999 కి తగ్గించబడింది . దీని తరువాత, జియో కి పోటీగా భారతి ఎయిర్టెల్ దాని 4G హాట్స్పాట్ ని 999 రూపాయల ధరతో ఇచ్చింది . ఇప్పుడు ఎయిర్టెల్ దాని 4G హాట్స్పాట్ తో ఏమి ఆఫర్ ఇస్తుందో అని ఆసక్తిగా వుంది .