Jio నెట్ వర్క్ విడుదల చేసిన ఆఫర్స్ అండ్ ప్లాన్స్ పై రీసెంట్ గా TRAI పరిశీలించి కొన్ని విధానాలు వెల్లడించింది. Welcome Offer పేరుతో Jio డిసెంబర్ 31 వరకూ అందరికీ అన్నీ ఫ్రీ అనౌన్స్ చేసింది కదా..
ఈ ఫ్రీ సర్వీసెస్ డిసెంబర్ 31 వరకూ ఉంటాయి. కాని డిసెంబర్ 3 తరువాత Jio సిమ్ ను తీసుకుంటే, welcome ఆఫర్ ఉండదు సిమ్ తో పాటు. Jio sim ను ఇంకా తీసుకోని వారు ఎవరైనా ఉంటె..
వారు డిసెంబర్ 3 లోపు తీసుకుంటేనే ప్రోమోషనల్ ఆఫర్ అనేది పొందగలరు. TRAI లెక్కలు ప్రకారం ప్రొమోషనల్ ఆఫర్ అనేది ఏదైనా అది రిలీజ్ అయిన తేదీ నుండి 90 రోజులు మాత్రమే ఉండాలి.
సో రిలయన్స్ Jio అధినేత ముకేష్ అంబానీ Welcome Offer పేరుతో అనౌన్స్ చేసిన ప్రమోషనల్ ఆఫర్ రోజు నుండి days calculate చేస్తే డిసెంబర్ 3 కు 90 రోజులు పూర్తవుతుంది.
అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా subscribers కు నష్టం లేదని చెప్పాలి. ఎందుకంటే కేవలం welcome ఆఫర్ కొత్తగా తీసుకోవటానికి అవ్వదు అంతే!
కాని ఆల్రెడీ వాడుతున్న వారికి free services ముందు చెప్పినట్లుగానే డిసెంబర్ 31 వరకూ ఉంటున్నాయి. సిమ్ తీసుకోని వారు ఉంటే డిసెంబర్ 3 లోపు తీసుకోవటం కష్టంతరమైన పని కూడా కాదు.
అలాగే ఇంతకముందు ఆర్టికల్ లో తెలిపినట్లు lifetime కాల్స్ కు charge చేయకపోవటం పై ఇతర నేత్వ్వర్క్స్ పెట్టిన కేసులకు TRAI… "వాటిలో ఎటువంటి తప్పు లేదు, lifetime free కాల్స్ అండ్ tariff ప్లాన్స అన్నీ సక్రమంగా ఉన్నాయి" అని తెలిపింది. సో lifetime పాటు Jio కాల్స్ కు ప్రత్యేకంగా charges ఉండవు.
కాల్స్ కు ఛార్జ్ లేనప్పటికీ.. సెపరేట్ గా tarrif ప్లాన్ వేసుకోవాలేమో కాని, ఈ tarrif ప్లాన్ రీచార్జ్ అనేది కాల్స్ కు కాదు, ఇంటర్నెట్ కు మాత్రమే. సో indirect గా కాల్స్ ఫ్రీ. గతంలో తెలిపినట్లు కాల్ ఇంటర్నెట్ పైనే వెళ్తాయి, అలాగని ఈ కాల్స్ చేసుకోవటానికి ఖర్చు అయ్యే ఇంటర్నెట్ కు కూడా Jio ఎటువంటి charges తీసుకోదు. అందుకే Jio ఫ్రీ కాల్స్ అయ్యాయి.