జియో తన టారిఫ్ ప్లాన్ ని అప్డేట్ చేసింది , మరియు కొన్ని పాత ప్లాన్స్ ని తొలగించింది . జూలైలో రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్ లను చివరిసారి అప్డేట్ చేసింది , అక్కడ ధన్ ధనా ధన్ పేరుతో 84 రోజుల కి 399 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ను ఆఫర్ చేసింది . ఇప్పుడు అప్డేట్ తరువాత జియో ప్రీ పైడ్ కస్టమర్స్ కోసం 52 రూ నుంచి మొదలై 4,999 రూ వరకు డేటా ప్లాన్ కలదు . అలానే పోస్ట్ పైడ్ కస్టమర్స్ కోసం డేటా ప్లాన్ 309 రూ. నుంచి మొదలై 999 రూ.వరకు కలవు.
అత్యంత ముఖ్యమైన మార్పు డేటా ప్రణాళిక 309 యొక్క ముగింపు, ఈ ప్లాన్ కింద 56 రోజులకు 1GB 4G డేటా రోజుకు మరియు అపరిమిత కాల్స్ ఇవ్వబడతాయి .కంపెనీ 399 ప్లాన్ ని కూడా సవరించింది.
399 రూ. రీఛార్జ్ తో , జియో ఇప్పుడు 84 కి బదులుగా 70 రోజులకు ప్రతీ రోజూ 1GB 4G డేటా , అన్లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ మరియు sms లను అందిస్తుంది . కంపెనీ ఇప్పుడు 459 రూ. కొత్త ప్లాన్ ని కూడా ప్రవేశపెట్టింది , దీనిలో 84 రోజులకు 1GB 4G డేటా అన్లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ మరియు SMS లు కలవు .
509 రూ. ప్లాన్ పై , రిలయన్స్ జియో 60 రోజుల వాలిడిటీ తగ్గించి 49 రోజులు చేసింది , మరియు యూజర్స్ కి ప్రతీ రోజు 2GB డేటా , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ SMS ల లాభం లభిస్తుంది . 999 రూ. రీఛార్జ్ పై జియో యూజర్స్ కి 90 రోజుల వాలిడిటీ , 60GB 4Gడేటా , అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ SMS ల లాభం లభిస్తుంది.
కంపెనీ 1,999 రూ. ప్లాన్ యొక్క వాలిడిటీ 120 రోజుల నుంచి పెంచి 180 రోజుల వరకు ఇస్తుంది . అయితే 4,999 రూ. డేటా ప్లాన్ యొక్క వాలిడిటీ 390 రోజుల నుంచి తగ్గించి 360 రోజులు ఇస్తుంది .
ఇతర రీఛార్జి అప్షన్స్ లో 52 డేటా ప్లాన్ లు ఉన్నాయి, వీటిలో 7 రోజులకు అపరిమిత 4G డేటా, అపరిమిత ఫ్రీ వాయిస్ కాల్స్ మరియు70 SMS లను అందిస్తుంది. అదే సమయంలో, 98 రూ. రీఛార్జ్ పై వినియోగదారులకు 2.1GB అపరిమిత 4G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు140 SMS లను పొందవచ్చు.14 రోజులకు .
149 రూ. రీఛార్జ్ పై , యూజర్స్ కి 28 రోజులకు 4.2GB అన్లిమిటెడ్ డేటా , అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ 300SMS ఫెసిలిటీ కలవు . పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం ఇప్పుడు 309 రూ , 409 రూ , 509రూ , 799 రూ మరియు 999రూ ప్లాన్ ఆప్షన్స్ కలవు .