Reliance Jio కేవలం 251 రూపాయలలో 102GB డేటాతో అద్భుతమైన ప్లాన్ ను ప్రవేశపెట్టింది

Updated on 05-Apr-2018

ఐపిఎల్ 2018 సెషన్లో రిలయన్స్ జీయో కొత్త మెగా ప్లాన్ ని  ప్రవేశపెట్టింది. అందులో మీరు 102 జిబి డేటాను పొందుతున్నారు. ఈ ప్లాన్ ధర రూ .251 మాత్రమే. దీనితో పాటు, మీరు  సునీల్ గ్రోవర్ యొక్క కామెడీ లైవ్ షో ను చూడగలరు.

102 జిబి డేటాను అందిస్తున్న ఒక కొత్త ప్లాన్ ని  ప్రవేశపెట్టింది మరియు దీని ధర 251 రూపాయలు. ఈ టెలికాం కంపెనీ కమేడియన్ సునీల్ గ్రోవర్ తన మైజియో యాప్ పై లైవ్ షో కోసం అతిధేయుడిగా ఉంటాడు  .ఈ ప్యాక్ లో  కంపెనీ తన కొత్త క్రికెట్ సీజన్ ప్యాక్ ని  కూడా ప్రవేశపెట్టినది .  ఈ ప్యాక్ లో క్రికెట్ అభిమానులు అత్యుత్తమ సౌకర్యాలు పొందుతున్నారు , ఈ ప్యాక్లో, ప్రతి లైవ్ క్రికెట్ మ్యాచ్ ని  వారి మొబైల్లో వీక్షించవచ్చు, 51 రోజుల వరకు నడిచే  ఈ పెద్ద ఈవెంట్ ప్రయోజనాన్ని పొందబోతున్నారు.

 సునీల్ గ్రోవర్ జియో ధన్ ధనా  ధన్ లైవ్ షో హోస్ట్ చేయనున్నారు . ఇందులో మీరు కపూర్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, శిల్పా షిండే, అలీ అస్గర్, సుగంధ మిశ్రా కూడా కనిపిస్తారు. మీరు మై  జియో యాప్ పై మాత్రమే ఈ షో ని  చూడగలరు. అయితే, ఇది జియో మరియు నాన్ జియో  వినియోగదారులకు ఉచితంగా ఉంటుంది.

 

 

 

Connect On :