ఎట్టకేలకు రిలయన్స్ JIO welcome offer 2017 మార్చ్ 31 వరకూ ఉంటుంది అని అంబానీ అనౌన్స్ చేశారు

Updated on 01-Dec-2016

ఫైనల్ గా రిలయన్స్ Jio Welcome offer మార్చ్ 31 2017 వరకూ extend అవుతుంది. ఈ విషయం స్వయంగా ఈ రోజు ముకేష్ అంబానీ అనౌన్స్ చేసారు.

ఇది Jio New Year Offer అని ఆయన పేర్కొన్నారు. గతంలో డిసెంబర్ 3 తరువాత వెల్కమ్ ఆఫర్ ఉండదు అని ఒక వార్త వచ్చింది. అది నిజమే.

కాని వాళ్ళకు కూడా march 31వరకూ వెల్కమ్ ఆఫర్ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 4 2016 తేదీ తరువాత కొత్తగా Jio సిమ్ ను తీసుకునే వారికీ కూడా ఫుల్ Jio సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం ఉన్న 52 మిలియన్స్ కస్టమర్స్ అందరూ డిసెంబర్ 31 తరువాత ఆటోమాటిక్ గా మార్చ్ 31 వరకూ unlimited ఇంటర్నెట్ అండ్ కాల్స్ కు అర్హులు అవుతారు. ఎటువంటి ప్రత్యెక చర్యలు చేయనవసరం లేదు అన్నారు.

అయితే ఒక మైనస్ ఉంది. 31 తరువాత నుండి రోజుకు 1GB లిమిట్ ఉంటుంది. 1GB కన్నా ఎక్కువ వాడితే స్పీడ్స్ తగ్గుతాయి అని తెలిపారు అంబానీ. ఇది అందరికీ నెట్ అందాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అన్నారు.

మరింత మాట్లాడుతూ అంబానీ Jio లో మొన్నటివరకూ ఉన్న కాలింగ్ అండ్ ఇంటర్నెట్ ఇబ్బందులను పేర్కొంటూ ఫ్యూచర్ లో ఇవి రాకుండా ఉండేందుకు కంపెని నిజంగా ప్రయత్నాలు చేస్తుంది అన్నారు.

గతంలో రిలయన్స్ Jio పై వ్రాసిన స్టోరీస్ ను క్రింద చూడగలరు. వాటిపై క్లిక్ చేస్తే ఆర్టికల్స్ ఓపెన్ అవుతాయి. ముందుగా ఈ లింక్ లో లేటెస్ట్ గా వ్రాసిన 1 రూపీ కన్నా తక్కువకి వస్తున్న Jio బ్రాడ్ బ్యాండ్ వివరాలు చూడగలరు

1. Unlimited ఇంటర్నెట్ అండ్ కాలింగ్ కలిగిన రిలయన్స్ Jio SIM కంప్లీట్ ఇన్ఫర్మేషన్
2. welcome offer complete questions and answers
3. రిలయన్స్ Jio లోని Welcome offer, మార్చ్ 2017 వరకూ పనిచేస్తుంది అనే వార్త ఎలా వచ్చింది?
4. welcome ఆఫర్ ముందుగా తెలిపిన డేట్ కన్నా ముందే ముగిసిపోతుంది.
5.  వాట్స్ అప్ & సోషల్ నెట్ వర్కింగ్ లో Jio పై రన్ అయిన రూమర్స్ లోని నిజాలు
6. Jio ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? అయితే ఈజీగా పెంచుకొండిలా ఇలా ​(tested)
7. Jio సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోగలరు ఈ లింక్ లో తెలిపినట్లు చేస్తే

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :