రిలయన్స్ జీయో ఇటీవల తన వినియోగదారులకు 4 కొత్త డేటా బూస్టర్ల ప్లాన్ లను ప్రవేశపెట్టింది. ఈ డేటా బూస్టర్ ప్లాన్లలో, రూ 11, రూ 21, 51, రూ 101 లకు నాలుగు ప్లాన్ లు ఉన్నాయి. ప్రస్తుతం, ఈ నాలుగు ప్లాన్ లు లైవ్ కాదు , కానీ కంపెనీ ఈ ప్లాన్స్ ని తదుపరి కొన్ని గంటల లో లైవ్ చేయబోతుంది.ప్లాన్ యొక్క డేటా లిమిట్ అయిపోయిన తరువాత మరియు వాలిడిటీ మిగిలిపోయినప్పుడు వినియోగదారులకు ఈ ప్లాన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ విధంగా, మీరు ఈ డేటా బూస్టర్ ప్లాన్ల సహాయంతో అదనపు డేటాను పొందగలరు. ప్రీపెయిడ్ వినియోగదారులు కంపెనీ వెబ్సైట్ మరియు మై జియో యాప్ రీఛార్జ్ ద్వారా ఈ నాలుగు ప్లాన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు.
జియో యొక్క డేటా booster ప్లాన్ లో కేవలం డేటా ప్రయోజనాలు మాత్రమే లభ్యం . కంపెనీ యొక్క మునుపటి యాడ్స్ ఆన్ ప్లాన్ లో , వినియోగదారులు డేటాతో వాయిస్ కాల్స్ యొక్క ప్రయోజనాన్ని పొందారు, కానీ ఈ ప్లాన్ల లో వినియోగదారులకు కేవలం అదనపు డేటా లాభం పొందుతారు. 11 రూపాయల ప్లాన్ లో, వినియోగదారులు 4G స్పీడ్ తో 400 MB అదనపు డేటా పొందుతారు. 21 రూపాయల ప్లాన్ లో వినియోగదారులకు 1GB డేటా, 3 జీబి 51 రూపాయల ప్లాన్ లో , మరియు 6GB 4G డేటా రూ 101 లకు లభిస్తుంది.